ఈ మార్గాల్లో మూడు రోజులు రైళ్ల రద్దు - ఇదీ లిస్టు..!!
ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రైళ్లను రద్దు చేసారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు..వరదలు కారణంగా దాదాపు అయిదు వందలకు పైగా రైళ్లు పలు మార్గాల్లో రద్దయ్యాయ. దెబ్బ తిన్న రైల్వే ట్రాక్ లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు పెరిగాయి. ఇదే సమయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు 29 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రైళ్ల రద్దుతో
వర్షాలు..ట్రాక్ ల నిర్వహణతో పాటుగా సాంకేతిక కారణాలతో మూడు రోజులు పలు రైళ్లను రద్దు చేసారు. నేటి నుంచి 11వ తేదీ వరకు ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందని వెల్లడించారు. భారీ వర్షాల సమయంలో దాదాపుగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా..మరి కొన్ని దారి మళ్లించారు. వర్షాలు తగ్గటంతో తిరిగి రైళ్ల రాకపోకలు యధావిధిగా ప్రారంభం అయ్యాయి. వందేభారత్ రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసారు. ఇప్పుడు మరోసారి 29 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రద్దయిన రైళ్లు
రద్దు చేసిన జాబితాలో అయితే వాటిలో విజయవాడ--బిట్రుగుంట, రాజమండ్రి--విజయవాడ, విజయవాడ--మచిలీపట్నం, మచిలీపట్నం--గుడివాడ, విజయవాడ--ఒంగోలు, విజయవాడ--మచిలీపట్నం, విజయవాడ--భీమవరంటౌన్, భీమవరంటౌన్--నిడదవోలు, భీమవరంటౌన్-నర్సాపూర్, నర్సాపూర్--విజయవాడ, గుంతకల్లు--రాయ్‌చూర్, విజయవాడ--రాజమండ్రి మార్గంలో నడిచే ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. ఈ తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయం రవాణాను చూసుకోవాలని అధికారులు సూచించారు.
మరోసారి వర్షాలతో
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదల కారణంగా రోడ్డు రవాణా వ్యవస్థ పలు చోట్ల దెబ్బ తింది. బస్సులు పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు..నదుల్లో ప్రవాహం పెరిగింది. రానున్న మూడు రోజులు భారీ వర్షాల పైన అలర్ట్ జారీ అయింది. దీంతో...మరోసారి రైల్వే అధికారులు ట్రాక్ ల నిర్వహణ పైన ఫోకస్ చేసారు. రైళ్ల రాకపోకల పైన ప్రభావం లేకుండా ముందస్తుగా అప్రమత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications