శబరిమలకు వెళ్లే ప్రత్యేక రైళ్లకు ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే..!!

Sabarimala temple: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.

మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

SCR will run special trains to Sabarimala from Moula Ali Kacheguda Kakinada and Narsapur

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో 28 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నెల 11, 18, 25 తేదీల్లో మౌలాలి నుంచి సాయంత్రం 6:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07193 రైలు మరుసటి రోజు రాత్రి 11:55 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో కొల్లం నుంచి మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07194 రైలు మరుసటి రోజు ఉదయం 9:15 నిమిషాలకు మౌలాలికి చేరుకుంటుంది.

14, 21, 28 తేదీల్లో మౌలాలి నుంచి సాయంత్రం 6:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07149 రైలు మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. 16, 23, 30 తేదీల్లో కొల్లం నుంచి మద్యాహ్నం 2:30 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07150 రైలు మరుసటి రోజు ఉదయం 9:50 నిమిషాలకు మౌలాలికి చేరుకుంటుంది.

చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనచెర్రి, తిరువళ్ల, చెంగన్నూర్‌లల్లో ఈ రైళ్లకు హాల్ట్ సౌకర్యం ఉంది.

2025 జనవరి 2, 9, 16, 23 తేదీల్లో కాచిగూడ నుంచి కొట్టాయం, 3, 10, 17, 24 తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తాయి. అదే నెల 6, 13 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి కొల్లం, 8, 15 తేదీల్లో కొల్లం నుంచి కాకినాడ టౌన్, 20, 27 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లం, 22, 29 తేదీల్లో కొల్లం నుంచి నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+