గూగుల్ లో ఆ వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నారా? జైలుపాలవుతారు జాగ్రత్త!
నిజ జీవితంలో మనకు ఏ చిన్న అవసరం ఉన్న ప్రతి ఒక్కరం గూగుల్ మీదనే ఆధారపడుతున్నాం. ఏది కావాలన్నా సరే గూగుల్ లోనే వెతుక్కుని ఆ పని తాలూకు సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. గూగుల్ ప్రస్తుతం మన నిత్యజీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే గూగుల్లో ప్రతి అంశాన్ని సెర్చ్ చేసే వాళ్ళు ఏది పడితే అది సెర్చ్ చేస్తే జైలు పాలు కావలసి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తించాలి.
గూగుల్ లో సెర్చ్ చెయ్యకూడనివి
గూగుల్ ఉంది కదా అని ఈజీగా ప్రతి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాం. అయితే కొన్ని రకాల సమాచారాల కోసం గూగుల్ లో సెర్చ్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున ఎవరైనా వీటిని సెర్చ్ చేస్తే తప్పకుండా వాళ్లు జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అసలు గూగుల్లో సెర్చ్ చేయకూడనివి ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తే కటకటాలే
కొంతమంది గూగుల్ ను అసాంఘిక కార్యకలాపాలకు కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి వాళ్ళు తాము చేయాలనుకున్న వాటికోసం గూగుల్ లో సమాచారాన్ని వెతుకుతున్నారు. అయితే గూగుల్ లో బాంబులు తయారు చేయడం గురించి ఎట్టి పరిస్థితులలోనూ సెర్చ్ చేయకూడదు. ఇలా ఎవరైతే గూగుల్ లో బాంబులు తయారీ గురించి సెర్చ్ చేస్తారో వారిని వెంటనే గుర్తించి గూగుల్ చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తుంది.
గూగుల్ లో వీటికోసం సెర్చ్ చేస్తే చట్టపరమైన చర్యలు
అంతేకాదు డ్రగ్స్ తయారీ విధానం గురించి కూడా గూగుల్ లో చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలా సెర్చ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సిస్టమ్స్ ని హ్యాక్ చేయడం, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేయడం గురించి google లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఇలా గూగుల్ లో వీటి కోసం సెర్చ్ చేస్తే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ పనుల గురించి గూగుల్ లో వెతకటం నేరం
అంతేకాదు ఇతరుల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను ఎవరైనా సరే గూగుల్ లో అప్లోడ్ చేస్తే కూడా వీరి పైన చర్యలు ఉంటాయి. కొందరు అబార్షన్ గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తారు. అబార్షన్ ఎలా చేసుకోవాలో గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. డాక్టర్ల పర్మిషన్ లేకుండా అబార్షన్ చేసుకోవడం నేరం. ఒకవేళ ఎవరైనా గూగుల్లో వీటి గురించి సెర్చ్ చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది.
ఈ పని చేస్తే జైలు శిక్ష
కొందరు అశ్లీల కంటెంట్ ను సెర్చ్ చేస్తారు. ఎవరైనా చిన్నపిల్లల అశ్లీల వీడియోలను, కంటెంట్లను సెర్చ్ చేస్తే అలాంటి వాళ్ళు జైలుకు వెళ్లడం ఖాయం. ఇలా గూగుల్ లో అశ్లీల కంటెంట్ ను సెర్చ్ చేస్తే వారికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.












Click it and Unblock the Notifications