బాత్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా ..యాజమాని రోజు అదే పని
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలనుకునే అద్దె ఇంట్లోనే దారుణం జరిగింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో, ఇంటి యజమాని పాల్పడిన అత్యంత నీచమైన చర్య స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే... సదరు ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక దంపతుల వ్యక్తిగత జీవితాన్ని రికార్డు చేయాలని పన్నాగం పన్నాడు. ఇందుకోసం, ఎవరికీ అనుమానం రాకుండా, వారి బాత్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు.

ఈ నీచమైన పనిని యజమాని ఒంటరిగా చేయలేదు. తనతో పాటు ఎలక్ట్రీషియన్ చింటూను కూడా భాగస్వామిగా చేసుకున్నాడు. ఎలక్ట్రికల్ పనుల పేరుతో చింటూ లోపలికి వెళ్లి ఈ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.
తాము నిత్యం ఉపయోగించే బాత్ రూమ్‌లో కెమెరా ఉందనే విషయం తెలుసుకున్న అద్దె దంపతులు తీవ్ర ఆందోళన, ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ధైర్యం చేసి, నేరుగా మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దారుణానికి సహకరించిన ఎలక్ట్రీషియన్ చింటూ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నమ్మకంతో తమ ఇంటిని అద్దెకు తీసుకున్న వారి గోప్యతను, భద్రతను అపహాస్యం చేస్తూ, యజమాని ఇలాంటి చర్యకు పాల్పడటం అత్యంత హేయమైనదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో, మరొకరి సహాయంతో ఈ కుట్రను అమలు చేసిన తీరు సమాజంలో నైతిక పతనం ఎంతగా జరిగిందో తెలియజేస్తోంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications