ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని ప్లాట్‌ఫామ్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత దాదాపు 100 రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్టేషన్‌ను ఆధునీకరించడం , ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.దీంతో ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2,ప్లాట్‌ఫార్మ్ నంబర్ 3,ప్లాట్‌ఫార్మ్ నంబర్ 4,ప్లాట్‌ఫార్మ్ నంబర్ 5,ప్లాట్‌ఫార్మ్ నంబర్ 10లను తాత్కాలికంగామూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
100 రోజుల నుంచి 130 రోజుల వరకు ఈ ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పనుల కారణంగా పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకొని ప్రయాణానికి సిద్ధం కావాలని అధికారులు సూచించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్‌లో భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసమే ప్లాట్‌ఫార్మ్‌లను దశలవారీగా మూసివేస్తున్నారు.

ఈ అభివృద్ధి పనులు 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం 40% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.ఉత్తరం , దక్షిణం వైపులా కొత్త టెర్మినల్ భవనాల నిర్మాణం (గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు).రెండు అంతస్తుల స్కై కాన్‌కోర్స్ నిర్మాణం, ఇందులో రిటైల్ అవుట్‌లెట్‌లు, కెఫెటేరియాలు , ఇతర ప్రయాణీకుల సౌకర్యాలు ఉంటాయి. ఉత్తరం వైపు బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ మరియు దక్షిణం వైపు భూగర్భ పార్కింగ్ నిర్మాణాన్ని చేపట్టారు.ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడానికి రెండు 7.5 మీటర్ల వెడల్పు గల ట్రావెలర్‌లతో కూడిన నడక మార్గాల ఏర్పాటు చేస్తున్నారు.
26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్‌లు ,రెండు వైడ్ ఫుట్‌బ్రిడ్జ్‌ల ఏర్పాటు.ప్రయాణీకుల కోసం విశాలమైన లాంజ్‌లు, ఆధునీకరించిన టికెట్ కౌంటర్‌లు, ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాళ్లు మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా మారనుంది మరియు ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.ఈ పునరాభివృద్ధి పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా మారనుంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications