పైశాచికం: తెలంగాణలో ఏడేళ్ల బాలికపై రేప్, ఆపై హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా రేగొండ మండలం గోరి కొత్తపల్లిలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజునే ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చారు.

స్థానికంగా నివాసం ఉంటున్న రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ ఆదివారం సాయంకాలం సమయంలో పెళ్లి ఊరేగింపు వద్దకు వెళ్ళింది. అయితే రాత్రి వరకూ ఆ చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో రేగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

seven years old girl raped and killed

అయితే పొలాల్లో రేష్మ అత్యాచారానికి గురై మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seven years old girl has been raped and murdered in Jayashankar Bhupalapalli district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి