మైనర్ బాలికపై లైంగిక దాడి.: సీఐ రవికుమార్ పై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సీఐ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. హనుమకొండలోని పీజీఆర్ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలుమార్లు లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు రవికుమార్ గతంలో మామునూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలకు, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు విభాగంలో పనిచేస్తూ.. యువతిని వేధింపులకు గురిచేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Sexual assault on minor girl POCSO case registered against CI Ravikumar

చిన్నారిపై దారుణం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేటలో అక్టోబర్ 12న నాలుగేళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి కుటుంబసభ్యులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్ రిపోర్టులు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసుపై దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. డీసీపీ కోటిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిత్యం కనిపెట్టుకుని ఉండాలని వారు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+