మోడీకి కెసిఆర్ మద్దతు వెనక కుట్ర: షబ్బీర్ అలీ
మోడీకి కెసిఆర్ మద్దతు వెనక కుట్ర: షబ్బీర్ అలీ
నగదు రహిత వ్యవస్థకు, ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకటం వెనుక పెద్ద కుట్ర దాగుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రధానమంత్రితో గంటసేపు సమావేశమైన కేసీఆర్ ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సొంత అవసరాల కోసమే కేసీఆర్ ప్రధానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. నల్లధనం ఎవరి వద్ద ఉన్నది అన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications