శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇకపై 24 గంటలూ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ సేవలు!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం వేలాది మంది ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ విశేష సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో విమాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించేందుకు ప్రత్యేక ప్రీమియం ఎయిర్‌పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సేవలు సంవత్సరంలోని అన్ని రోజులు, 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఎయిర్ పోర్ట్ నిర్వహిస్తున్న సంస్థ జీఎంఆర్ వెల్లడించింది.

ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలతో నిరంతర రవాణా

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రద్దీ సమయాలు, సెలవు దినాలు సహా అన్ని ప్రయాణ షెడ్యూళ్లకు అనుగుణంగా ప్రయాణికులకు నిరంతర రవాణా సౌకర్యాన్ని ఈ ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలతో అందించనున్నట్టు పేర్కొంది. 200కు పైగా సెడాన్‌లు మరియు ఎస్‌యూవీలతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనాలు పూర్తిగా విమానాశ్రయ కార్యకలాపాల కోసమే కేటాయించబడటం వల్ల సేవల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

shamshabad airport taxi services launch of special premium airport taxi services for passengers

అరైవల్స్ విభాగంలో ప్రత్యేక కౌంటర్లు

ప్రయాణికులు అరైవల్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సేవలను పొందవచ్చు. శిక్షణ పొందిన సిబ్బంది, డ్రైవర్లు ప్రయాణికులకు సేవలు అందిస్తారు. అదనంగా, మొబైల్ యాప్ లేదా బుకింగ్ కియోస్క్ ద్వారా కూడా టాక్సీని బుక్ చేసుకోవచ్చు. అనంతరం అరైవల్స్ విభాగంలోని ప్రత్యేక పిక్-అప్ బే నుంచి కేటాయించిన టాక్సీలో ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

నగర పరిధిలో ఇన్-సిటీ ప్రయాణాలకు అందుబాటులో

అన్ని వాహనాలు విమానాశ్రయం నిర్దేశించిన కఠిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. పరిశుభ్రత, హైజీన్ ప్రయాణానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం ఈ సేవ నగర పరిధిలో ఇన్-సిటీ ప్రయాణాలకు అందుబాటులో ఉంది. దీంతో విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు నగరంలోకి సులభమైన కనెక్టివిటీ లభిస్తుంది.

ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కదిర్ కదిరవన్ మాట్లాడుతూ, "జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడం మా కార్యకలాపాల ప్రధాన లక్ష్యం అన్నారు . ప్రత్యేక ఎయిర్‌పోర్ట్ టాక్సీ సేవల ప్రారంభం ద్వారా విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తున్నాం అన్నారు . 24/7 అందుబాటు, ప్రీమియం వాహనాలు మరియు డ్రైవర్లతో ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q