సలహాలు నచ్చనోడికి సలహాదురుడు కావాలా.?సీఎం, సోమేష్ బంధంపై భగ్గుమన్న షర్మిళ.!
హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఘాటుగా విమర్శించారు వైయస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకని, ఒక వేళ సలహాలు ఇస్తే చెవిటోని ముందు శంఖం ఊదినట్లు ఉంటుందని వైఎస్ షర్మిల సీఎం చంద్రశేఖర్ రావును విమర్శించారు. నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించారని,ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశాని సీఎం చంద్రశేఖర్ రావు పై షర్మిళ ధ్వజమెత్తారు.
ప్రజల కష్టాలు పట్టని కేసీఆర్ : ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చోబెట్టుకున్నారని మండి పడ్డారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నారని, తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ సీఎంకు ఆయన పార్టీ బీఆర్ఎస్ కి పని చేస్తున్నారన్నారు షర్మిళ.

తడిసిన ధాన్యాన్ని కొంటారా.?కొనరా : అకాల వర్షాలకు వడ్లు మొలకెత్తి ఓ కౌలు రైతన్న ప్రాణం పోయిందని, చనిపోతానని ముందే చెప్పినా కూడా ఆదుకోని అసమర్థ ప్రభుత్వం చంద్రశేఖర్ రావుదని షర్మిళ విరుచుకుపడ్డారు. కండ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిదని, రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దా అని నిలదీసారు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిళ.

పంటభీమా ఎందుకు ఇవ్వరు : అంతే కాకుండా మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొనాలని షర్మిళ డిమాండ్ చేసారు. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువాలని, క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపాలని, తడిసిన వడ్లు సైతం కొనాలపి, ఇచ్చిన హామీ ప్రకారం కనీసం 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలపి షర్మిళ డిమాండ్ చేసారు.ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన చంద్రశేఖర్ రావుదని షర్మిళ మండి పడ్డారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications