ఒంటరి పోరుకు సిద్ధమయిన షర్మిల...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని గత కొద్ది రోజులుగా నడుస్తోన్న చర్చకు నేడు తెర పడింది. ఇన్నాళ్ల నుంచి జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తను ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది.
ముందు నుంచి చెబుతున్నట్లగానే ఆమె పాలేరు నుంచి పోటీ చేయనున్నారు. మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తానని షర్మిల చెబుతున్నారు. అయితే అది ఎక్కడి నుంచి అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోని 119 స్థానాల్లో పార్టీ బరిలో ఉంటుందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన షర్మిల: తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, KC వేణుగోపాల్‌తో షర్మిల అనేకసార్లు భేటీ అయ్యారు. షర్మిల డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో ఈ విలీనం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒంటరిగా చేయాలా లేదంటే ఏకంగా ఎన్నికలకు దూరంగా ఉండాలా అనేదానిపై షర్మిల సమాలోచలను చేశారు. అయితే, చివరికి ఒంటరి పోరుకే సిద్ధమయ్యారు షర్మిల.
విలీనం ఆగిపోవడానికి ఆ రెండు షరతులే కారణమా...?: కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల ప్రధానంగా రెండు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి తనను తెలంగాణ రాజకీయాలకే పరిమితం చేయాలి. రెండోది పాలేరు టికెట్టు ఇవ్వడం... ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వస్తే అది పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హైకమాండ్‌కు రాష్ట్ర పీసీసీ నివేదిక ఇచ్చి ఉండొచ్చుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంచేత ఈ వీలీనం ఆగిపోయి ఉండొచ్చన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications