కోడిగుడ్లు వేశారు: షర్మిలను చూసి ఉద్వేగం(పిక్చర్స్)
నల్గొండ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్రకు నల్గొండ జిల్లాలో పలుమార్లు తెలంగాణ సెగ తగిలింది. పరామర్శ యాత్రలో భాగంగా ఆమె మూడో రోజు అయిన శుక్రవారం మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ దుర్గమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మరో వృద్ధురాలిని పరామర్శిస్తుండగా తెరాస విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె పైకి కోడిగుట్లు, టమాటాలు విసిరి నిరసన తెలిపారు. పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, షర్మిల శుక్రవారం నాడు నాలుగు కుటుంబాలను పరామర్శించారు. ఆలగడప, సల్కుపూరు, సీతారాంపురం, నందిపాడు తదితర గ్రామాల్లో షర్మిల పర్యటించారు. ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైయస్ లాంటి నాయకుడు లేడని, భవిష్యత్తులో రాడని షర్మిల అన్నారు. షర్మిల రాక నేపథ్యంలో పలువురు అభిమానులు ఆమెను చూసి ఉద్వేగానికి లోనయ్యారు.

షర్మిల
పెద్ద బిడ్డలా మీ కుటుంబాలను ఆదుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం భరోసా ఇచ్చారు.

షర్మిల
ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.

షర్మిల
మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

షర్మిల
రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలన్నీ తీరతాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె పాలమూరు జిల్లాలో పర్యటించి, తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు ఆమె నల్గొండలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications