గన్ పార్క్ లో గర్జించిన షర్మిళ.!సీఎం కు10ప్రశ్నలు సంధించిన వైయ్యస్సార్ టీపి అధినేత్రి.!
హైదరాబాద్ : తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను సీఎం చంద్రశేఖర్ రావు మోసం చేస్తూనే ఉన్నారని, 4.5లక్షల కోట్ల అప్పుల కుప్పగ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారని వైయస్సార్ టీపీ అధినేత్రి, వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు సీఎం దోచుకున్నారని, మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీ జరిగిందని, దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ పెట్టి, పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల. దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే ముందు తను సంధిస్తున్న 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
నిరుద్యోగులకు న్యాయం జరిగిందా : అంతే కాకుండా తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సీఎంచంద్రశేఖర్ రావు చెప్పాలని డిమాండ్ చేసారు వైఎస్ షర్మిల. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమయ్యిందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని,రుణమాఫీ అని రైతులను మరో మోసం చేసారని, తెలంగాణలో 36 లక్షల మందికి సొంత ఇళ్లులు లేవని, చంద్రశేఖర్ రావు కేవలం 26 వేల ఇండ్లు ఇస్తే, 36 లక్షల మందికి న్యాయం చేసినట్లా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, దళిత బందులోని నిధులను సగం ఎమ్మెల్యేలు కాజేస్తున్నారని మండిపడ్డారు.















Click it and Unblock the Notifications