అఖిలపక్ష నేతల వద్దకు షర్మిళ.!టీ సేవ్ కార్యక్రమానికి మద్దత్తు కూడగట్టనున్న వైయస్సార్ టీపీ చీఫ్.!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ దూకుడు పెంచారు. మొన్నటి వరకూ ప్రజా ప్రస్ధానం పాద యాత్ర ద్వారా మంత్రులను, ఎమ్మెల్యేలను తూర్పార బట్టిన షర్మిళ ప్రస్తుతం రూట్ మార్చారు. తెలంగాణలో పోటీ పరిక్షల్లో నెలకొన్న సందిగ్దత, పేపర్ లీకేజీలు, నిరుద్యోగుల అసంతృప్తి, విద్యార్ధుల ఆందోళనలు వైయస్ షర్మిళను కదిలించినట్టు తెలుస్తోంది.
అందుకే నిరుద్యోగ, విద్యార్ధి లోకం తరుపున గళమెత్తేందుకు టీసేవ్ కార్యక్రమాన్ని తీసుకునన్నారు షర్మిళ. అందుకోసం వివిధ రాజకీయ పక్షాల నేతలను మంగళవారం స్వయంగా సంప్రదించబోతున్నారు షర్మిళ.

నిరుద్యోగుల పక్షాన ఉద్యమం.: కోదండరాం తో షర్మిళ భేటీ: నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్న వైయస్సార్ టీపి అధినేత్రి వైఎస్ షర్మిల. మంగళవారం ఉదయం 11 గంటలకు జన సమితి అధినేత కోదండరాంతో టీజేఎస్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో భేటీ కానున్నారు వైఎస్ షర్మిల.
మధ్యాహ్నం 2.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో సీపిఎం రాష్ట్ర ఇంచార్జ్ తమ్మినేని వీరభద్రం, నిరుద్యోగుల పక్షాన టీ సేవ్ ఫోరం ఏర్పాటుకు కలిసి పని చేద్దామని లెఫ్ట్ నేతలను కోరనున్నారు వైఎస్ షర్మిల.
నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదాం: అఖిలపక్షానికి షర్మిళ వినూత్న పిలుపు: ఇదిలా ఉండగా రాజకీయాలను పక్కన బెట్టి యువత కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాలని షర్మిళ పిలుపునిచ్చారు. ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ ఫాం అవ్వాలని, మన జెండాలు వేరైనా ఒక్క అజెండాతో నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదామన్నారు షర్మిళ.
టీసేవ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీన్ అండ్ ఎంప్లాయిమెంట్ ఫోరాన్ని ప్రారంభించారు షర్మిళ. ఇందులో అన్ని పొలిటికల్ పార్టీలు ఉంటాయని, కలిసి పోరాటం చేద్దామన్నారు షర్మిళ. ఇక టీసేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని, దీంట్లో ప్రతిపక్షాలకు అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు షర్మిళ.
YSRTP అధినేత్రి వైయస్ షర్మిల గారు ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమకారులు ప్రొ. కోదండరాం గారితో భేటీ అయ్యారు. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణం, నిరుద్యోగ సమస్య, కేసీఆర్ వైఫల్యాలపై చర్చించారు. నిరుద్యోగుల పక్షాన ఉమ్మడి పోరాటానికి కలిసి రావాలని కోదండరాం గారిని కోరారు. pic.twitter.com/T0dP1wTBWd
— YSR Telangana Party (@YSRTelangana) April 4, 2023
నిరుద్యోగుల కోసమే టీ సేవ్ ఫోరం: అందరూ మదద్దత్తు ఇవ్వాలన్ని షర్మిళ: ఈ ఫోరానికి ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదన్నారు షర్మిళ. కోదండరామ్ అధ్యక్షుడుగా ఉండాలని కోరుకుంటున్నట్ఠు షర్మిళ అభిప్రాయపడ్డారు.
కోదండరామ్ గతంలో ఎన్నో ఉద్యమాలను లీడ్ చేసిన వ్యక్తి అని, రాజకీయాలకు అతీతంగా ఇతర వ్యక్తులను ఎవరికి బాద్యతలు కట్టబెట్టినా పర్వాలేదని, అందరం కలసి ఒకరిని నాయకుడిని ఎన్నుకావాల్సిన అవసరం ఉందన్నారు షర్మిళ. యువత కోసం మనం అందరం నిలబడాల్సిన అవసరం ఉందని,ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు షర్మిళ.
రేవంత్, బండి సంజయ్ కూడా కలిసి రావాలి: పీసిసి చీఫ్ కు షర్మిళ ఫోన్: ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ ఆహ్వానిస్తున్నానని, ప్రతిపక్షాలు అన్నీ కలిసి రావాలని, అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు షర్మిళ.
ఒక్కటిగా పోరాటం చేస్తే అనుమతులు వస్తాయని, ప్రగతి భవన్ ముందు ధర్నా చేయడానికి కూడా అనుమతి వస్తుందని, ప్రగతి భవన్ లోపల కూడా ధర్నాకు అనుమతి వస్తుందన్నారు షర్మిళ. కాంగ్రెస్, బీజేపిలు కలిసి రావాలని, కాంగ్రెస్ ఉంటే తాము రామని బండి సంజయ్ అంటున్నారని, బీజేపి ఉంటే తాము రామని రేవంత్ రెడ్డి అంటుండం సంమంజసం కాదన్నారు షర్మిళ.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications