నా కోరిక తీర్చకపోతే నీ కుటుంబ సభ్యులను చంపుతానంటూ లైంగిక వేధింపులు, చివరికిలా...

తన కోరిక తీర్చకపోతే నీతోపాటు కుటుంబసభ్యులను చంపేస్తా, చెప్పిన సమయానికి రాకపోతే నీ పని ఖతం అంటూ యువతులను భయబ్రాంతులకు గురిచేస్తున్న 23 కేటుగాళ్లను రాచకొండ షీటీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

హైదరాబాద్: తన కోరిక తీర్చకపోతే నీతోపాటు కుటుంబసభ్యులను చంపేస్తా, చెప్పిన సమయానికి రాకపోతే నీ పని ఖతం అంటూ యువతులను భయబ్రాంతులకు గురిచేస్తున్న 23 కేటుగాళ్లను రాచకొండ షీటీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

కేటుగాళ్ళకు షీ టీమ్స్ నిపుణులతో కౌన్సిలంగ్ ఇచ్చారు.ఆకతాయిల తల్లిదండ్రులు, భార్యల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. కొత్త తరహా వేధింపులకు దిగుతున్నారని పోలీసులు గుర్తించారు. కోరికతీర్చకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా వేధిస్తున్న 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

She teams arrested 23 members for sexual harassement

బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేస్తే వారివివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెప్పారు.35 ఏళ్ళ మహిళను కోరిక తీర్చాలని వెంటపడ్డాడు 22 ఏళ్ళ యువకుడు. తన కోరికను తీర్చకపోతే ఆమెతోపాటు ఆమె కుటుంబసభ్యులను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె నిరాకరించింది.

తరచూ సందేశాలు పంపుతూ భయబ్రాంతులకు గురిచేశాడు. స్నేహితురాలి సహాయంతో ఆమె షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది. ఉప్పల్, విజయపురి కాలనీకి చెందిన ఓ కాల్ సెంటర్ ఉద్యోగి రమేష్ రెడ్డి ఈ రకంగా వేధింపులకు పాల్పడ్డాడని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.

తనకు ఉద్యోగం కావాలని వచ్చిన మహిళపై ఓ సెక్యూరిటీ సంస్థ ఎండీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఇంటికి వెళ్ళి మరీ ఆమెను భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించింది.దీంతో నిందితుడు బుచ్చయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

డిగ్రీ చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి, తనను ప్రేమించాలని ఓ బాలికను వేధించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆమె చేయిపట్టుకోగా బాధితురాలి సోదరుడు చూశాడు. అతడిని పట్టుకొని షీ టీమ్స్ కు అప్పగించాడు. నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు వేధించేవారి గురించి 9490617111 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+