బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వకు షాక్.. కేసు నమోదు!
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కు పోలీసులు షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ అయిన గంగవ్వ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ తో లోపలికి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ హౌస్ లో రచ్చ లేపుతున్నారు. మిగతా కంటెస్టెంట్స్ తో సమానంగా ఆటలో దూసుకుపోతున్నారు.
రామ చిలుకతో వీడియో
ఇక తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో ఉన్న గంగవ్వ పైన ప్రస్తుతం అసలు ఎందుకు కేసు నమోదు అయింది. ఆ కేసు వివరాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ యూట్యూబర్ రాజుతో కలిసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓసారి గంగవ్వ రామచిలుకను ఉపయోగించి ఒక వీడియోని చేశారు.

వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు
2022 మే నెలలో తీసిన ఈ వీడియోలో చిలుకను ఉపయోగించడం పైన గంగవ్వ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవ్వ తో పాటు యూట్యూబర్ రాజు చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నట్టు చేసిన వీడియోతో చిలుకను ఉపయోగించి దానిని హింసించి, వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమ్ అనే వ్యక్తి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన జగిత్యాల అటవీశాఖ అధికారులు
వినోదం కోసం చిలుకని హింసించడం చట్ట ఉల్లంఘన క్రిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జగిత్యాల అటవీశాఖ అధికారులు గంగమ్మ తో పాటు, యూట్యూబ్ రాజు పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ వీడియో కోసం చిలుకను కొండగట్టు దేవాలయం సమీపంలోని ఒక జ్యోతిష్యుడు దగ్గర నుంచి తెచ్చినట్టు సమాచారం.
ఈ కేసులో ఏం జరుగుతుందో
ఈ క్రమంలోనే వీరి పైన వచ్చిన ఫిర్యాదు మేరకు గంగవ్వ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వచ్చేవరకు ఆగుతారా లేదా బిగ్ బాస్ హౌస్ లోకే నోటీసులు పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications