బిగ్ బాస్ కు షాక్.. దివ్వెలమాధురి, రీతూచౌదరి.. ఏంటీ దరిద్రం..సీరియస్ అల్టిమేటం!

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 9 ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము రేపుతుంది. ఈ సీజన్ విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ, ఈ సీజన్ పైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాను రాను బిగ్ బాస్ లో అశ్లీలత పెరిగిపోతుందని, నెగెటివిటీ పెరిగిపోతుందని, ఈ షో ద్వారా ఏం సందేశం ఇస్తారని పలువురు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు.

బిగ్ బాస్ రియాల్టీ షో పై అభ్యంతరాలు
ఇదొక డీ గ్రేడ్ రియాల్టీ షో అని కొందరు దీనిని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం అని కొందరు లబోదిబోమంటున్నారు. అశ్లీలతకు అడ్డాగా ఈ షో మారుతుందని నిప్పులు జరుగుతున్నారు .ఇదొక వల్గర్ షో అని దీనిని ఆపవలసిన అవసరం ఉందని అంటున్నారు.

Shock for Bigg Boss with police complaint Divvela madhuri Rithu Chowdary Serious ultimatum

Take a Poll

నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
ఇక ఇదే క్రమంలో బిగ్ బాస్ షోలో అశ్లీలతకు వ్యతిరేకంగా గజ్వేల్ కు చెందిన కొందరు యువకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ లు బిగ్ బాస్ షో నిర్వాహకులు, మరియు ఈ షోను హోస్ట్ చేస్తున్న నటుడు నాగార్జున పైన కూడా చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ షోతో ఏం సందేశం ఇస్తున్నారు
సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అశ్లీల కంటెంట్ తో ఈ షోను నిర్వహిస్తున్నారని, నైతిక విలువలు లేని వ్యక్తులను మాత్రమే కంటెస్టెంట్ లుగా ఎంపిక చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి కంటెస్టెంట్ ల ఎంపిక ద్వారా ఈ కార్యక్రమం ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన గజ్వేల్ యువకులు
ఈ రియాలిటీ షోలో అశ్లీలత, పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సాహం జరుగుతోందని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన గజ్వేల్ కు చెందిన యువకులు ఈ షోను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షోలో కుటుంబాలు కలిసి చూడలేని స్థాయిలో అశ్లీల సన్నివేశాలు, అనవసర వాగ్వాదాలు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ షో నిర్వాహకులకు అల్టిమేటం
ఇది యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల వెంటనే షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బిగ్ బాస్ షో ను నిలిపివేయకపోతే మహిళా సంఘాలతో అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని వారు షో నిర్వాహకులకు అల్టిమేటం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+