మందు బాబులకు షాక్.. శనివారం మద్యం దుకాణాలు బంద్!!
మందు బాబులకు చేదు వార్త చెప్పారు హైదరాబాద్ పోలీసులు. ఓవైపు ఎండలు దంచి కొడుతున్న సమయంలో పగలంతా కష్టపడి పనిచేసిన మందుబాబులు రాత్రి అయితే చల్లటి బీర్లు తో చిల్ అవుతున్న వేళ వైన్స్ తోపాటు, కల్లు దుకాణాలను కూడా బంద్ చేస్తున్నామని చెప్పి మందు బాబులకు షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ హైదరాబాద్ పోలీసులు మందుబాబులకు షాక్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అంటే..
వైన్స్, కల్లు దుకాణాలు బంద్
హిందువులు 12వ తారీకు శనివారం రోజున హనుమాన్ జయంతి పండుగను జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి భావనతో హనుమాన్ జయంతి ఉత్సవాలను హిందువులంతా నిర్వహిస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి రోజున హనుమాన్ విజయ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం నగరవ్యాప్తంగా అన్ని వైన్స్, కల్లు దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆంక్షలు
దీంతో మార్చి 12వ తేదీన శనివారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు హైదరాబాద్ నగరంలోని అన్ని వైన్స్, కల్లు దుకాణాలు బంద్ చేస్తున్నారు. ఎవరైనా పోలీసుల ఆదేశాలు ఉల్లంఘించి ఎక్కడైనా అక్రమంగా మద్యాన్ని విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లైసెన్సు రద్దు చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
పోలీసుల నిర్ణయంతో మందుబాబులు అలెర్ట్
అయితే ఇదే సమయంలో స్టార్ హోటల్స్ లో ఉన్న బార్లు, లైసెన్స్ ఉన్న క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. హనుమాన్ జయంతి రోజున లిక్కర్ షాపులు క్లోజ్ ఉంటాయని వెల్లడించడంతో, మందుబాబులు ఇప్పటినుంచి అలర్ట్ అవుతున్నారు. లిక్కర్ షాప్ ని క్లోజ్ అయ్యే రోజు లిక్కర్ కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందే కొనుక్కొని రెడీగా పెట్టుకుంటారు.
లిక్కర్ కు ఇబ్బంది లేకుండా మందుబాబుల జాగ్రత్త
ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చేలా లిక్కర్ షాపులు బంద్ చేసినా, లిక్కర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటారని చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications