వాహనదారులకు షాక్.. ఇకపై వాహనాలు కొంటే ఆ ట్యాక్స్ మోత మోగుడే!

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ వాహనాలపై లైఫ్‌ టాక్స్‌ను గణనీయంగా పెంచింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 14 నుండి అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం. 53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్‌లో మార్పులు చేసినట్టు సమాచారం.

తెలంగాణాలో పెరిగిన లైఫ్ ట్యాక్స్
దీని ప్రకారం టు వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్‌ టాక్స్ వర్తిస్తుంది. ఇది పేద మధ్యతరగతి వారిపైన అదనపు భారంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం కోసం రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం ప్రకారం, రూ. 50 వేలలోపు ధర కలిగిన ద్విచక్ర వాహనాలపై 9 శాతం పన్ను విధిస్తారు.

Shock for motorists From now on if you buy vehicles you will have to pay the increased life tax

లైఫ్ ట్యాక్స్ టారిఫ్ లు ఇలా
రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష వరకు ఉన్న బైకులపై 12శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. ఈ పన్నులో ఎటువంటి మార్పు లేదు. రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల మధ్య ఉన్న వాహనాలపై 15 శాతం, రూ. 2లక్షలకు పైబడిన వాటిపై 18శాతం లైఫ్‌ టాక్స్ వసూలు చేస్తారు. ఇదే సమయంలో విద్యుత్తో నడిచే ఈవి వాహనాల పైన ఎలాంటి పన్నులు విధించడం లేదు.

నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలపైనా భారీగా లైఫ్ ట్యాక్స్
ప్రభుత్వం మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం తెలంగాణ సర్కార్ వాహనదారులపైన లైఫ్ టాక్స్ లో మార్పులు చేర్పులు చేసింది. ఇక తాజాగా మార్చిన లైఫ్ టాక్స్ ప్రకారం ఒక లక్ష పదివేల రూపాయల విలువైన బైక్ కు ఇంతకుముందు 13200 పన్ను చెల్లించగా, ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో 16,500లైఫ్ టాక్స్ అవుతుంది. నాన్ ట్రాన్స్పోర్ట్ ఫోర్ వీలర్ వాహనాలపై కూడా ప్రభుత్వం లైఫ్ టాక్స్ ను భారీగా పెంచింది.

కొన్ని కేటగిరీలలో లైఫ్ ట్యాక్స్ ఇలా
ఐదు లక్షల రూపాయల లోపు కార్ల పైన 13 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య కార్ల పైన 18 శాతం పన్నును విధించింది. కంపెనీలకు పేరుతో కొనుగోలు చేసే వాహనాలకు, రెండో వాహనాలపై మరింత పన్ను విధిస్తారు. కొన్ని కేటగిరీలలో ఇది 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో కార్ల కొనుగోలుపై అదనపు భారం
అయితే విద్యుత్ వాహనాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం, విద్యుత్ వాహనాలకు మినహాయింపును డిసెంబరు 31 2026 వరకు కొనసాగించనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్ల మీద అదనంగా 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆటోమొబైల్ రంగంలో పనిచేసే ప్రముఖులు ఈ పెంపు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+