Priyanka Reddy పై అత్యంత పాశవికంగా ఆ నలుగురు... పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన దారుణం లో పోలీసులు కేసును చేదించారు . పోస్ట్ మార్టంనివేదిక సైతం కీలక విషయాలను వెల్లడించింది. ప్రియాంక రెడ్డి ని అత్యాచారం చేసి, అతి దారుణంగా హత్య చేసి ఆపై 28 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకు వెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు పోలీసులు .ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక సైతం ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా నిర్ధారించింది.

ప్రియాంకా పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

ప్రియాంకా పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక షాక్ కు గురిచేసింది. అత్యంత పాశవికంగా ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసి, ఆమెను హతమార్చినట్లు గా పోస్టుమార్టం నివేదికలో తేలింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. దీంట్లో పలు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం సేవించి నలుగురు ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని, ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని వైద్యులు తేల్చారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    నలుగురు ఆమెపై పాశవిక దాడి చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక

    నలుగురు ఆమెపై పాశవిక దాడి చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక

    చంపేసే ముందు కనీసం నలుగురు ఆమెను పాశవికంగా అనుభవించారని, ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. ప్రియాంక రెడ్డి ని రేప్ చేసి, ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారని, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించారు.ఈ ఘటనలో ప్రియాంక మృతదేహం 70 శాతానికి పైగా కాలిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.

    పోలీసుల అదుపులో నిందితులు ...విచారణ వేగం

    పోలీసుల అదుపులో నిందితులు ...విచారణ వేగం

    ఇక ఈ దారుణానికి సంబంధించి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఓ లారీ డ్రైవర్ క్లీనర్తో పాటు మరో ఇద్దరు కారణమని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది . ముగ్గురు నిందితులు 25 ఏళ్ల వయసున్న యువకులని తెలుస్తుంది. పోలీసులు వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+