అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి: అబార్షన్ చేయించి, మేనకోడలంటూ..

హైదరాబాద్: శంషాబాద్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. భక్తురాలిగా వచ్చే అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి వెంకటసాయి కృష్ణ ఆమెను హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. కేసు దర్యాప్తులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో వెంకటసాయి కృష్ణ పూజారిగా చేస్తున్నారు. ఆ గుడికి అప్సర తరచూ వస్తూండేది.

ఈ క్రమంలోనే వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి అప్సరకు అబార్షన్ కూడా చేయించాడు వెంకటసాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను చంపాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలోనే గోశాలకు వెళ్దామని చెప్పి.. శంషాబాద్ తీసుకెళ్లిన వెంకటసాయి ఆమెకు మత్తు టాబ్లెట్ ఇచ్చాడు. మత్తులోకి వెళ్లిన తర్వాత ఆమెను బండరాయితో కొట్టి చంపాడు వెంకటసాయి.

apsara

ఆ తర్వాత అప్సర మృతదేహాన్ని కారులో సరూర్‌నగర్ తీసుకొచ్చిన వెంకటసాయి.. అక్కడి తహశీల్దార్ ఆఫీసు వెనక భాగంలోని సెప్టిక్ ట్యాంక్‌లో వేసి.. దానిపై ఎర్రమట్టి పోశాడు. ఆ తర్వాత ఆ సెప్టిక్ ట్యాంక్ మొత్తాన్ని సిమెంట్‌తో చదును చేయించాడు. జూన్ 3న హత్య చేసిన నిందితుడు వెంకటసాయి.. జూన్ 5న తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు తన మేనకోడలు అప్సర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అప్సర తన మేనకోడలు అంటూ సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై అతని తండ్రి స్పందించారు. అప్సర తమ బంధువు కాదని.. ఆమెను ఒకసారి గుడిలో చూసి ఇద్దర్నీ హెచ్చరించినట్లు తెలిపారు వెంకటసాయి తండ్రి. ఇక మూడు నెలలుగా తమ కొడుకునే వేధించడంతో హత్య చేసివుండవచ్చునని అతని తెలిపాడు. ఆమెను వెంకటసాయి హత్య చేయడానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరాడు.

apsara

మరోవైపు, అప్సరను హత్య చేసిన పూజారి వెంకటసాయిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఆమె తల్లి. కోయంబత్తూరుకు అని తీసుకెళ్లి హత్య చేశాడని చెబుతున్నారు అప్సర తల్లి. అక్కయ్యగారూ అన్నం పెట్టండి అని అడిగిన వ్యక్తి పెళ్లి గురించి అడిగితే మాట్లాడేవాళ్లం కదా అని అంటున్నారు. తమ కూతుర్ను హత్య చేసిన అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

కాగా, అప్సర కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జూన్ 5న ఉదయం యువతి తల్లితో కలిసి సాయికృష్ణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ బంధువు అయిన అప్సర అనే యువతి కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టగా అసలు కోణం బయటకు వచ్చింది. సాయికృష్ణ చెప్పేది అంతా నమ్మశక్యంగా లేకపోవడంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యాకోణం వెలుగులోకి వచ్చిందని సీఐ పేర్కొన్నారు.

ఆమె వేధింపులు తట్టుకోలేకనే అప్సరను హత్య చేసినట్లు సాయకృష్ణ ఒప్పుకున్నాడన్న ఇన్​స్పెక్టర్.. ఈ హత్యలో ఇంకెవరైనా ఉన్నారనే దానిపై విచారిస్తున్నామన్నారు. అప్సర మృతదేహాన్ని బయటకు తీసి... పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+