మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. క్రైం లవ్ స్టోరీలో షాకింగ్‌విషయాలు
మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. ప్రేమించిన అమ్మాయి కోసం బీటెక్ చదువుతున్న నవీన్ ను స్నేహితుడే హతమార్చాడు. లవ్ మర్డర్ కేసులో షాకింగ్‌విషయాలు బయటకు వచ్చాయి.
నల్గొండ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో నవీన్ ను అతని స్నేహితుడు హరి హర కృష్ణ హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు లవ్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలను ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. పోలీసుల ముందు లొంగిపోయి నేరాన్ని అంగీకరించిన హరి హర కృష్ణపై ఐపీసీ సెక్షన్ 302, 201, 5 (2) (వి) మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమించిన అమ్మాయి కోసం ఒళ్ళు గగుర్పొడిచేలా మర్డర్
ఇక ఈ కేసులో పోలీసులు ముందు లొంగిపోయిన హరి హర కృష్ణ పోలీసులకు చెప్పిన విషయాలు ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. ఇంతకీ హరి హరికృష్ణ ఏం చెప్పాడంటే తాను నవీన్ ఇంటర్మీడియట్ దిల్ సుఖ్ నగర్ లో కలిసి చదువుకున్నామని, ఆ సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, నవీన్ వల్ల తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైందని పేర్కొన్నాడు.
తాను ప్రేమించిన అమ్మాయి నవీన్ తో సన్నిహితంగా ఉండేదని పేర్కొన్న హరిహర కృష్ణ ఈ క్రమంలోనే నవీన్ హత్య కోసం మూడు నెలలుగా ప్లాన్ చేసి సమయం కోసం ఎదురు చూశాను అంటూ చెప్పుకొచ్చాడు.

గుండెను చీల్చి, మర్మంగాలు కోసి, పొట్ట మొత్తం కోసి పేగులు బయటకు తీసిన నిందితుడు
ఇక ఆపై ఫిబ్రవరి 17వ తేదీన తాను నవీన్ తో కలిసి ఎల్బీనగర్లో తిరిగానని, అదే రోజు పెద్ద అంబర్ పేటకు చేరుకోగానే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఇక ఈ క్రమంలోనే నిర్మానుష్య ప్రాంతానికి నవీన్ ను తీసుకువెళ్లి, నవీన్ పై కత్తితో దాడి చేసి హతమార్చినట్టుగా నేరాన్ని అంగీకరించాడు హరి హరకృష్ణ.
ఇక పోలీసులకు చిక్కకుండా ఉండడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్న అతను మృతదేహాన్ని ఎవరు గుర్తించకుండా.. దుస్తులు తొలగించి.. నవీన్ తల, మొండెం వేరు చేయడంతో పాటు, గుండెను చీల్చి, మర్మంగాలు కోసి, పొట్ట మొత్తం కోసి పేగులు బయటకు తీసినట్టు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు.

క్రైమ్ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ ఎఫెక్ట్
హత్యకు ఉపయోగించిన కత్తి పట్టుకోవడానికి ముందు హరిహరికృష్ణ గ్లౌజులు ధరించాడని కత్తిపై వేలిముద్రలు ఉంటే పోలీసులకు చిక్కుతామని గ్రహించి ఈ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇంత దారుణంగా హతమార్చిన నిందితుడు మానసిక స్థితిని గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా మనిషిని చంపడానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. క్రైమ్ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ చూసి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు చేదించిన పోలీసులు.. నిందితుడు రిమాండ్
పోలీసులకు దొరక్కుండా పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ హత్యకు ముందు మద్యం కొనుగోలు చేసిన సమయంలో ఇద్దరు ఒకే చోట ఉండడం, ఘటనా స్థలికి వెళ్లే మార్గంలో సీసీటీవీ ఫుటేజ్ హత్య జరిగిన సమయంలో ఇద్దరి సెల్ ఫోన్ లొకేషన్ ఒకే ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు గుర్తించగలిగారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు కాకుండా పోతుందని తోటి విద్యార్థి నవీన్ ని చంపిన కేసులో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరుపరచగా నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో హరిహర కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు.

కఠిన శిక్ష పడేలా చూస్తామన్న రాచకొండ సీపీ
ఇక ఈ ఘటన చాలా బాధాకరమని, ప్రేమ కోసం ప్రాణాలు తీయడం సరైన పద్ధతి కాదని రాచకొండ సిపి చౌహన్ వెల్లడించారు. తాము పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడుతున్నామని విచారణ వేగంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు నిండితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాచకొండ సి పి చౌహన్ వెల్లడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications