షాకింగ్: సీఎం చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి వార్.. చంద్రబాబు కింకర్తవ్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు మరోమారు తెరమీదకు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న నీళ్ళ పంచాయతీ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తుంది.
కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణా పంచాయితీ
దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించిన ఫలితం లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
ఇక కృష్ణ జలాల వివాదంలో నేడు మరోమారు విచారణ చేపట్టిన క్రమంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు, న్యాయవాదులతో చర్చించి కృష్ణానది జలవివాదం పైన దిశానిర్దేశం చేశారు.

కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలన్న రేవంత్
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా పోరాటం చేయాల్సిన అవసరాన్ని వారు సూచించారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. నీళ్లలో మెజారిటీ వాటా తెలంగాణకు దక్కాలని వారు ఉన్నతాధికారులకు, న్యాయవాదులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల పైన కృష్ణ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో అభ్యంతరం
అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని ఆయన పేర్కొనడం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తో రేవంత్ రెడ్డి తలపడుతున్నాడు అన్న భావనను కలిగిస్తుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పైన అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి శాఖకు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు, ఏపీ సీఎంకు లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
గురువుపై శిష్యుడి వార్
దీంతో చంద్రబాబు పైన యుద్ధానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చ జరుగుతోంది. గురుశిష్యుల మధ్య వాటర్ వార్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు క్యాబినెట్ భేటీ జరగనుండగా ఈ భేటీలో కూడా బనకచర్ల ప్రాజెక్టు పైన ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు కిం కర్తవ్యం ఏమిటి అనేది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications