షాకింగ్: నాలుగేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు హత్య! చేసింది భర్తా? ప్రియుడా?
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వేమకుంటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. మృతులను అపర్ణ, అమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కుమార్తె కార్తికేయినిగా గుర్తించారు.
సోమవారం స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... భీమవరానికి చెందిన అపర్ణ కొంతకాలంగా హైదరాబాద్‌లోని చందానగర్ ఉంటూ ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తోంది. రెండు రోజులుగా అమె తన విధులకు హాజరుకావడం లేదు.

కిటికీలోంచి తొంగిచూసేసరికి...
రోజూ విధులకు హాజరయ్యే అపర్ణ రెండ్రోజులుగా రాకపోవడం అపర్ణ పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ షోరూంలోని తోటి సిబ్బందికి అనుమానం కలిగించింది. దీంతో సోమవారం వారు అపర్ణ ఇంటికి వచ్చారు. ఎంతసేపు పిలిచినా తలుపులు తెరవకపోవడంతో కిటికీలోంచి లోపలికి తొంగి చూసి నిర్ఘాంతపోయారు. లోపల వారంతా విగతజీవులై పడి ఉండడంతో షాక్ తిని పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు...
చందానగర్‌లోని వేమకుంటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో హత్యోదంతం గురించి సమాచారం అందగానే ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్‌లు తిరుపతిరావు, హరిశ్చంద్రారెడ్డి పరిశీలించారు. అపర్ణను బలమైన కర్ర లేదా రాడ్ తో కొట్టడంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగి రెండ్రోజులు అవుతుండడంతో మృతదేహాలు కొద్దిగా కుళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని...
అపర్ణ పదేళ్ల క్రితం భీమవరం నుంచి నగరానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మధు అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందని, వారిద్దరికీ ఓ పాప పుట్టిందని, ఆ తరువాత మధుకు అంతకు ముందే మరొకరితో వివాహం అయ్యిందని అపర్ణకు తెలిసిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై భార్యభర్తలిరువురి మధ్య గొడవ జరిగిందని, దీంతో ఎనిమిదేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని చెబుతున్నారు.

భర్తా? ప్రియుడా? చంపిందెవరు?
మరోవైపు ఓ మొబైల్ షాప్ నిర్వాహకుడు రూప్‌లాల్ అనే వ్యక్తితో ప్రస్తుతం అపర్ణ ప్రేమలో ఉన్నట్లు కూడా స్థానికుల సమాచారం ద్వారా అర్థమవుతోంది. ఈ విషయంలో పగ పెంచుకుని ఆమె భర్త మధు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని కొందరు అంటున్నారు. మరికొందరేమో అపర్ణపై మోజు తీరిపోయిన ఆమె ప్రియుడు కూడా వారితో గొడవ పడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మధు, రూప్‌లాల్ దొరికితేగాని ఈ హత్య కేసులో మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు కూడా వారిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న దృష్ట్యా వారిద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications