అతిగా మూత్రం పోస్తోందని చిన్నారి జననాంగాల్లో ... హైదరాబాద్ డే కేర్ సెంటర్లో అమానుషం !
లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నామని పిల్లల ఆలనాపాలనా పట్టించుకోకుండా బేబీ కేర్ సెంటర్లలో వదిలి పెడుతున్న తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. బేబీ కేర్ సెంటర్లలో మీ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో మీకు తెలుసా? ఒక బేబీ కేర్ సెంటర్ లో ఆయాల నిర్వాకం తెలిస్తే మీరు మీ పిల్లల్ని ఎలాంటి వాతావరణంలో వదిలిపెడుతున్నారో అర్థమవుతుంది. అన్ని బేబీ కేర్ సెంటర్లలోనూ అలాగే ఉంటారా అంటే చెప్పలేం కానీ తల్లి లాగా బేబీ కేర్ సెంటర్ లో ఆలనాపాలనా ఉండదనేది మాత్రం కచ్చితంగా నిజం.

మాదాపూర్ లోని బేబీ కేర్ సెంటర్ లో దారుణం
హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ బేబీ కేర్ సెంటర్ లో మూడున్నర్రేళ్ళ చిన్నారిపై జరిగిన అమానుషం బేబీ కేర్ సెంటర్ల పనితీరుకు అద్దం పడుతుంది.ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే దంపతులు ఇద్దరూ తమ మూడున్నరేళ్ల పాపను మాదాపూర్ లోని ఓ ప్రైవేటు బేబీ కేర్ సెంటర్ కు పంపిస్తున్నారు. ప్రతిరోజు లానే పదవ తేదీన కూడా చిన్నారిని బేబీ కేర్ సెంటర్ కు పంపించిన తల్లి సాయంత్రం చిన్నారిని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం విని షాక్ తింది.

మాటిమాటికీ మూత్రం పోస్తుంది అని జననాంగంలో రాయి పెట్టిన ఆయాలు
ప్రతిరోజూ బేబీ కేర్ సెంటర్ లో ఏం జరుగుతుందో ఇంటికి రాగానే పూసగుచ్చినట్టు చెప్పే చిన్నారి ఆరోజు తనపై ఇద్దరు ఆయాలు చేసినటువంటి అమానుష ఘటన తల్లి కళ్లకు కట్టినట్లుగా చెప్పింది.మాటిమాటికి మూత్రం పోస్తుందని ఆరోజు ఇద్దరు ఆయాలు తన జననాంగంలో రాయి ఉంచారని తెలిపింది. ఇక ఈ విషయాన్ని విన్న వెంటనే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయాలతో పాటు బేబీ కేర్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జరిగిన దాడి చిన్నారి చెప్పటం వల్లే వెలుగులోకి .. మాటలు రాణి చిన్నారుల పరిస్థితి ?
మూడున్నర్రేళ్ళ చిన్నారి తన పై జరిగినటువంటి దాడిని తల్లితో చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరి మాటలు రాని, చెప్పలేని చిన్నారుల పరిస్థితి మాటేంటి ? లక్షల్లో సంపాదిస్తూ, వేలల్లో ఫీజు చెల్లిస్తున్నామని బేబీ కేర్ సెంటర్లను నమ్ముకుంటే చిన్నారులను సముదాయించే ఓపికలేని ఆయాలో, లేక నిర్వాహకులో చిన్నారులను వేధిస్తే ఆ పసి ప్రాణాలు అల్లాడి పోవా ?

తల్లిని మించిన సంరక్షకులు లేరు ... బేబీ కేర్ సెంటర్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త
నోరు తెరిచి నాకు ఇలా జరిగింది అని చెప్పలేని చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే అలా వారిని బాధించిన పాపం తల్లిదండ్రులదే అవుతుంది. అందుకే మీకంటే మీ చిన్నారుల ఆలన, పాలన చూసేవారు ఎవరు ఉండరు అనేది గుర్తుంచుకోవడం ముఖ్యం. మాటలు చెప్పలేని పసివాళ్ళు తల్లి సంరక్షణలోనే ఉండటం శ్రేయస్కరం . మీ సంపాదన సంగతి పక్కన పెడితే ఎంతో ప్రేమగా పెంచుకునే మీ పిల్లలు బేబీ కేర్ సెంటర్ లలో పడే ఇబ్బంది తల్లిగా అర్ధం చేసుకోవాలి . అందుకే బేబీ కేర్ సెంటర్ లను నమ్ముకున్న తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications