Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెట్టింగ్ యాప్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాళ్ళ మెడపై కత్తి!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసినటువంటి కేసులో మొత్తం 11 మంది పైన మొదట కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ
ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నేహా శర్మ తో సహా మొత్తం 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కొందరు నందమూరి బాలకృష్ణ ,ప్రభాస్ ,గోపీచంద్ తదితరులపైన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్టు ఫిర్యాదులు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నోటీసులు ఇచ్చి సెలబ్రిటీలను విచారణ చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు.

Shocking twist in the betting apps case police targets betting apps owners

19 మంది యాప్ ఓనర్ల పైన కేసులు
అయితే ఈ కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి పైనే కాకుండా బెట్టింగ్ యాప్స్ యజమానుల పైన పోలీసులు ఉక్కు పాదం మోపేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా యజమానులను టార్గెట్ చేసి చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం 19 మంది యాప్ ఓనర్ల పైన కేసులు నమోదు చేశారు.

ఈ యాప్స్ యజమానులపై కేసులు
జంగిల్ రమ్మీ డాట్ కాం, ఏ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, ధని బుక్ 365, వి వి బుక్, మామ 247, ఎస్ 365 జై 365, తెలుగు 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 యజమానుల పైన కేసులను నమోదు అయ్యాయి. ఇక ఇల్లీగల్ బెట్టింగుకు నిర్వాహకులే బాధ్యులని ప్రాథమిక ఆధారాలను సేకరించారు పోలీసులు.

యాప్స్ యజమానుల మెడకు ఉచ్చు
ఈ కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో యాప్ ల యజమానులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిని చార్జిషీట్లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్స్ కేసు లో ఇప్పుడు యాప్ ల యజమానుల మెడకు గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+