వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,29 న మోడి సమక్షంలో బిజేపిలో చేరనున్న జితేందర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ నుండి మరో వికేట్ అవుట్ అయింది. అసెంబ్లి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుండి లోక్ సభ టికెట్ లు దక్కని నేతలు ఆ పార్టీ నుండి జంప్ అవుతున్నారు..ఈనేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ మాజి ఎంపీ ,ప్రభుత్వ సలహదారు, వివేక్ టిఆర్ఎస్ కు రాజీనామ చేయగా తాజగా మహబుబ్ నగర్ టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి బిజేపితో మంతనాలు జరుపుతున్నారు..నిన్న రాత్రి జితెందర్ రెడ్డి తో పార్టీ బిజేపి జాతియ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో భేటి అయ్యారు.దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డిగులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డి

నిన్నటి వరకు పార్టీలో ఉంటానన్న జితేందర్ రెడ్డి,
నిన్నటి వరకు పార్టీ మారనని జితెందర్ రెడ్డి చెప్పారు.తానకు సీటు కేటాయించకున్న పార్టీని వీడనని స్పష్టం చేశారు.దీంతో పాటు తాను టిఆర్ఎస్ గెలుపుకు కృషి చేస్తానని చెప్పారు. అయితే మహబుబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి బిజేపి తరుఫున డి.కే అరుణ పోటి చేస్తున్నారు..దీంతో ఆమేను గెలిపించేందుకు బిజేపి పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే స్థానికంగా బలంగా ఉన్న జితెందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది.పార్టీలో చేరేందుకు మూడు డిమాండ్లు

shok to TRS ,jitender reddy to join bjp

అయితే బిజేపిలో చేరేందుకు జితేందర్ రెడ్డి బిజేపి ముందు మూడు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది, ఇందులో ప్రధానంగా రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ గా ప్రకటించడంతో పాటు ఈనెల 29న రాష్ట్రానికి రానున్న మోడితో తాను ప్రయాణించాలని చెప్పారు .ఇక తనను రాజ్యసభ కు నామినేట్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.అయితే రాజ్యసభ డిమాండ్ కాకుండా మిగతా రెండింటిని రాంమాధవ్ అంగీరించినట్టు తెలుస్తోంది.

29 న మోది సమక్షంలో పార్టీలో చేరిక
కాగా ఈ నెల 29 న మహబుబ్ నగర్ లో జరగనున్న ప్రధాని మోడి పాల్గోనున్న బహిరంగ సభలో పార్టీ కండువా కప్పుకోనున్నారు, కాగా మహబుబ్ నగర్ చేరుకోనున్న ప్రధాని మోడి ఆయన ఇంటికి వెళ్లనున్నట్టు సమాచారం.

ఇంటి పార్టీ కే తిరిగి వెళ్లనున్న జితెందర్ రెడ్డి
కాగా జితేందర్ గతంలో బిజేపిలో పలు పదవుల్లో కొనసాగారు, అనంతరం 1999 నుండి 2004 లో బిజేపి ఎంపీగా గెలుపోందారు,అనంతరం టీడీపీలో ,అక్కడనుండి టిఆర్ఎస్ లో 2014 లో తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారనే అరోపణలతో ఆయనకు తిరిగి మహబుబ్ నగర్ స్థానం నుండి పోటికి నిరాకరించారు సిఎమ్ కేసిఆర్

English summary
shok to TRS,one more leader change the party ,mp jitender ready to join Bjp,discussion with party leader Ram madhav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X