నటి కేసు: అన్నీ బయటకు... జైలు నుంచి యోగి విడుదల, కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ కమ్ నటితో పాటు ఆమె భర్తకు అసభ్య సందేశాలు పెట్టిన కేసులో అరెస్టైన షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగి గురువారం చర్లపల్లి జైలు నుంచి బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తన పైన కేసు పెట్టడం అంటే మానసికంగా వేధించడమే అని వ్యాఖ్యానించారు. దీనిపై తాను చట్టపరంగా పోరాడుతానని చెప్పారు. ఆ నటి అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో తనపై దాడి చేయించిందని ఆరోపించారు. వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. అన్నీ వెలుగు చూస్తాయన్నారు.
చదవండి: 4 గంటల పాటు విచారణ, అసలు శశిధర్ ఎవరు, విజయ్ టార్చర్ చెప్పేస్తా: వనితారెడ్డి

యోగితో ఫేస్‌బుక్ పరిచయం
యోగిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిదు రోజులుగా పరారీలో ఉన్న అతనిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. బాధితురాలు గచ్చిబౌలి హిల్‌రిడ్జ్ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఈమెకు బీహెచ్‌ఈఎల్ సమీపంలోని విద్యుత్ నగర్‌లో నివాసముంటున్న యోగి(35)తో కొంతకాలం కిందట ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి అసభ్య సందేశాలు
నటన పట్ల ఆసక్తి ఉన్న సదరు నటితో యోగేష్ స్నేహం పెంచుకున్నాడు. ఏడాదిపాటు సాఫీగా సాగిన స్నేహంలో ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. దీంతో యోగి ఆమెకు వాట్సప్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా అసభ్య సందేశాలను పంపించాడని, ఆమె భర్తకు సైతం సదరు సందేశాలు పంపించి ఆమె కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తానంటూ ఇష్టానుసారంగా దూషించాడని పోలీసులు తెలిపారు.

రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
దీంతో బాధితురాలు ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించంది. అతనిపై 354(డీ)506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా అతనికి నోటీసులు జారీచేశారు. అయితే యోగి తప్పించుకు తిరగాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

గతంలో మహిళను వేధించిన కేసు
మియాపూర్‌లోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి రూ.20వేల డిపాజిట్‌తో పాటు ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. సకాలంలో పూచీకత్తులు అందజేయకపోవడంతో యోగిని చర్లపల్లి జైలుకు తరలించారు. 2016లో ఓ మహిళను వేధించిన ఘటనలో కూడా అతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

దుబాయ్‌లో కాలో చెయ్యో తీసేస్తారు
ఇదిలా ఉండగా యోగి సదరు నటి తనతో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయనలా దుబాయ్‌లా చేస్తే కాలో చెయ్యో తీసి వేస్తారన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications