4 గంటల పాటు విచారణ, అసలు శశిధర్ ఎవరు, విజయ్ టార్చర్ చెప్పేస్తా: వనితారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆయన సతీమణి వనితా రెడ్డిని పోలీసులు బుధవారం నాలుగు గంటల పాటు విచారించారు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫీ వీడియోలో భార్యతో పాటు మరో ఇద్దరి పేర్లు ప్రస్తావించారు. దీంతో పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు.

చదవండి: అప్పుడే నటుడు విజయ్ కేసులో పురోగతి, బయటపడేందుకు భార్య ప్రయత్నాలు

కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన వనితా రెడ్డి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఆధారాలు సమర్పించారు. ఆమెను పోలీసులు నాలుగు గంటల పాటు విచారించారు. మూడు రోజుల తర్వాత మరోసారి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: నేను ధైర్యంగా ముందుకొస్తే: నటి కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్, యోగికి బెయిల్ అంతలోనే

ఆధారాలు ఇవ్వమన్న పోలీసులు

ఆధారాలు ఇవ్వమన్న పోలీసులు

విజయ్ సాయి ఆత్మహత్యకు తనకు సంబంధం లేదని వనితా రెడ్డి చెబుతున్నారని, నీ వద్ద ఆధారాలు ఇవ్వాలని తాము అడిగినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు వనితా రెడ్డి మాట్లాడారు. తనకు నోటీసులు ఇచ్చారని, మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారని తెలిపారు. తాను విచారణలో అన్నీ చెబుతానని అన్నారు.

 రెండు పేర్లపై, నా పేరు ఎందుకు చెప్పారో

రెండు పేర్లపై, నా పేరు ఎందుకు చెప్పారో

తనకు రెండు పేర్లు ఉండటంపై వనితా రెడ్డి స్పందించారు. తాను పుట్టినప్పుడు వరలక్ష్మి అని పేరు పెట్టారని, అంతకు మించి ఏదీ లేదన్నారు. తన ఐడీ ప్రూఫ్స్ అన్నీ వనిత అనే పేరు మీదనే ఉన్నాయని చెప్పారు. తన పేరు విజయ్ సాయి ఎందుకు ప్రస్తావించారో తెలియడం లేదన్నారు.

శశిధర్ ఎవరో కూడా తెలియదు

శశిధర్ ఎవరో కూడా తెలియదు

సెల్ఫీ సూసైడ్‌లో విజయ్ సాయి శశిధర్ అనే పేరును కూడా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. దీనిపై కూడా వనిత స్పందించారు. అసలు శశిధర్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. విజయ్ తనపై చేసిన ఆరోపణలు అసత్యమనే ఆధారాలు సేకరించేందుకే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు.

నిజానిజాలు తెలుసుకోవాలి

నిజానిజాలు తెలుసుకోవాలి

వివాదానికి కారణమైన కారు గురించి మాట్లాడుతూ.. పది పదకొండు నెలల క్రితం ఆ కారును తన తండ్రి వద్ద నుంచి తీసుకున్నానని, అతను చనిపోయాడని సానుభూతితో అందరూ మాట్లాడుతున్నారని, కానీ నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను అన్ని నిరూపిస్తానని చెప్పారు.

విజయ్ నన్ను ఎంత టార్చర్ పెట్టిందీ చెప్తా

విజయ్ నన్ను ఎంత టార్చర్ పెట్టిందీ చెప్తా

తనకు సాక్ష్యాలు సేకరించేందుకు సమయం తీసుకుందని, పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా సిద్ధమని వనితా రెడ్డి చెప్పారు. గత మూడేళ్లుగా తాను ఎప్పుడు విజయ్‌ని బెదిరించలేదన్నారు. తనపై ఆరోపణలు నిజం కాదని చెప్పేందుకే ఫోటోలు విడుదల చేయాల్సి వచ్చిందన్నారు.
విజయ్ తనను ఎంత టార్చర్ పెట్టింది, ఆయనకు ఎందుకు దూరంగా ఉన్నది తన వద్ద అనని ఆధారాలు ఉన్నాయని, వాటిని మీడియా ముందుకు త్వరలో తీసుకు వస్తానని వనితా రెడ్డి చెప్పారు.

 పేర్లపై తకమిక, అలాంటిదేమీ లేదని వనిత

పేర్లపై తకమిక, అలాంటిదేమీ లేదని వనిత

కాగా, ఆమె అసలు పేరు వరలక్ష్మి అని, ఆ తర్వాత వనితా రెడ్డి, వనిత, విన్ని, బృందా అనే మారుపేర్లతో చలామణి అయిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వనితకు రెండు పాస్ పోర్టులు ఉన్నాయని, వాటిలో వేరు పేర్లు పెట్టుకున్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. తండ్రి విషయంలోను స్కూల్ సర్టిఫికెట్లో ఒక పేరు, పాస్ పోర్టులో మరో పేరును పరిశీలిస్తున్నారు. వనిత మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ending days of suspense, Vanitha Reddy, the wife of Tollywood comedian Vijay Sai, finally surrendered before the Jubilee Hills police on Wednesday afternoon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి