వైసీపీ బాస్ వాటా ఎంత? రూ. 1500 కోట్ల స్కామ్ బట్టబయలు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక నేతలు తీవ్ర కుట్రలకు తెరలేపారని పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఆదివారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అవినీతి, భూకబ్జాల చిట్టాను వారు మీడియా ముందుంచారు.

రాష్ట్రంలో అలజడుల వెనుక వైసీపీ హస్తం

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అని దుయ్యబట్టారు. వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోర్టు పరిధిలో ఉన్న భూములను కొల్లగొట్టేందుకు దొంగ (ఫోర్జరీ) జీవోలను సృష్టించి, సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

TDP MLA GV Anjaneyulu Accuses YS Jagan Mohan Reddy of Backing Rs 1500 Crore Land Scams in Vinukonda

ఈ భారీ కుంభకోణం బండారం బయటపడటంతోనే ఆయన భయంతో పరారయ్యారని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని కూడా వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించారని, ఈ దోపిడీ సొమ్ములో జగన్ మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే బహిష్కరిస్తారని, కానీ వైసీపీలో అవినీతిపరులకే అండగా నిలుస్తారని విమర్శించారు.

ఇక ఆ భూములు మీ సొంతం, చంద్రబాబు కీలక ప్రకటన..!!
ఇక ఆ భూములు మీ సొంతం, చంద్రబాబు కీలక ప్రకటన..!!

లాక్కోవడం, బెదిరించడం బొల్లా నైజం: ఎంపీ లావు

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. బొల్లా బ్రహ్మనాయుడు ఒక 'హ్యాబిచువల్ అఫెండర్' అని విమర్శించారు. ఎక్కడ విలువైన సామాన్యుల భూములు ఉంటాయో వాటిని గ్రద్దలా తన్నుకుపోవడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. గతంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధించిన బాధితులు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతూ పలు ఉదాహరణలను వెల్లడించారు.

జలాలపురం పరిధిలోని లెనిన్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిని ఆన్‌లైన్‌లోకి ఎక్కించనివ్వకుండా వేధించి, చివరికి దానిని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పనిచేసిన వెంకట్రావు అనే మాజీ సైనికుడిని సైతం వదలకుండా, వినుకొండ టౌన్ లో ఉన్న ఆయన సొంత భూమిని బెదిరించి లాక్కున్నారు. మైనారిటీల రక్షణ గురించి ప్రగల్భాలు పలికే బ్రహ్మనాయుడు, వినుకొండకు చెందిన 'నాగూర్' అనే ముస్లిం మైనారిటీ వ్యక్తి భూమిని కూడా దౌర్జన్యంగా ఆక్రమించారు. బ్రాహ్మణపల్లి దగ్గర జోసెఫ్ ఫ్రెడరిక్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన పట్టా భూమిని సైతం వదలకుండా లాక్కున్నారు. - ఎంపీ లావు

బుద్ధిపూర్వకంగానే నిబంధనల ఉల్లంఘన

గతంలో తిరుమల డైరీని ఒక ఫ్రెంచ్ కంపెనీకి దాదాపు రూ.1800 కోట్లకు అమ్మినప్పుడు జరిగిన ఒప్పందాన్ని ఎంపీ గుర్తుచేశారు. ఆ ఒప్పందం ప్రకారం భాగస్వాములు ఎవరూ ఐదేళ్ల వరకు తిరిగి అదే ఫీల్డ్‌లోకి రాకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం నిబంధనలను బేఖాతరు చేస్తూ మళ్లీ డైరీ రంగంలోకి ప్రవేశించారన్నారు. ఇది ఆయన అమాయకత్వంతో చేసింది కాదు, తెలిసి బుద్ధిపూర్వకంగా ఎదుటివారిని మోసం చేయడానికే ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.

వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

గత ఎన్నికల ముందు సొంత క్యాడర్‌పై విచక్షణారహితంగా బూతులతో విరుచుకుపడటం ఆయన నైజమని, పండించిన పంటను కొనుగోలు చేయాలని అడిగిన నరేంద్ర అనే సామాన్య రైతుపై సెక్షన్ 307 కింద తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిన దుర్మార్గ చరిత్ర బ్రహ్మనాయుడిదని మండిపడ్డారు. వైసీపీ నేతలు, వారి అనుకూల మీడియా ఈ తీవ్రమైన భూకబ్జాల అంశాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని, ఈ అక్రమ కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. చట్టం నుండి తప్పించుకునే అవకాశమే లేదని, త్వరలోనే ఆయన అరెస్ట్ కావడం ఖాయమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+