అప్పుడే నటుడు విజయ్ కేసులో పురోగతి, బయటపడేందుకు భార్య ప్రయత్నాలు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న నటుడు విజయ సాయి కేసులో కేసు దర్యాఫ్తు నత్త నడకన సాగుతోందని అంటున్నారు. కేసులో ఎలాంటి పురోగతి లేదని అంటున్నారు. ఆత్మహత్యకు ముందు విజయ్ సాయి తీసుకున్న సెల్ఫీ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు.
Recommended Video

ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని, అది వచ్చాక కానీ ఏమీ చేయలేమని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. కేసును అన్ని కోణాలలో నుంచి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల నుంచి తప్పించుకుంటూ క్షమాపణ
మరోవైపు, విజయ్ సాయి సతీమణి వనిత పోలీసులకు ఇంకా చిక్కడం లేదు. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆమె అందుకు క్షమాపణ కూడా చెబుతుండటం గమనార్హం.

కేసు నుంచి బయటపడేందుకు
త్వరలోనే పోలీసుల ముందుకు వస్తానని ఆమె ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. కేసు నుంచి బయటపడేందుకు ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుండవచ్చునని భావిస్తున్నారు.

ఏ ఒక్క ఆధారం వదులుకోకూడదనే
విజయ్ సాయి ఆత్మహత్య కేసు విషయమై తాను ఏ తప్పు చేయలేదని ఆమె చెబుతున్నారు. అందుకు తన వద్ద ఉన్న ఏ ఒక్క ఆధారాన్ని వదులుకోకూడదని ఆమె భావిస్తున్నారు. అందుకే ఇటీవల మరో మహిళతో సన్నిహితంగా ఉన్న విజయ్ సాయి ఫోటోలను ఆమె విడుదల చేశారు.

ఆరోపణలు
కాగా, విజయ్ సాయి ఎంతోమంది అమ్మాయిలను బెడ్ రూంకు తీసుకు వచ్చేవాడని వనితా రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు కోసం వేధించేవాడని కూడా చెప్పింది. తనను ఎన్నోసార్లు కొట్టాడని తెలిపింది. విజయ్ తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయింది. కాగా, ఆత్మహత్యకు ముందు రోజు విజయ్ సాయి నుంచి తీసుకు వెళ్లిన కారు తనదే అని కూడా చెప్పింది.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ












Click it and Unblock the Notifications