హైట్ తగ్గిస్తారా?: అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ మేజర్‌మెంట్స్ కోసం అభ్యర్థులను అంబర్‌పేట గ్రౌండ్‌కు సెలక్షన్ కమిటీ పిలిపించింది. అయితే, గతంలో వచ్చిన ఎంతు కంటే రీ మేజర్‌మెంట్స్ లో తక్కువ వచ్చిదంటూ ఆందోళనకు దిగారు.

డిజిటల్ మీటర్ ద్వారా తమ ఎత్తును తక్కువ చేసి చూపించి డిస్‌క్వాలిఫై చేస్తున్నారని ఆరోపించారు. మాన్యువల్‌గా ఎత్తు చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ పట్టించుకోవడం లేదన్నారు.

 SI and Constable candidates protest at amberpet police grounds for height measurement issues.

ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తమను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన హైట్ ఎప్పుడు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. తమకు మెయిన్స్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ పోలీస్ ఫిజికల్ టెస్ట్‌ల్లో గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకునే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య కారణాల వల్ల దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం ఇచ్చింది.

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీలు, బాలింతలకు మరోసారి ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు కల్పించింది పోలీసు నియామక మండలి. మెయిన్స్‌లో అర్హత పొందాక గర్భిణీలు, బాలింతలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈవెంట్స్ లో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 28వ తేదీ లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భం దాల్చిన స్త్రీలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ గురువారంనాడు కరీంనగర్‌లో ఆందోళన చేపట్టారు. కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ముందు 40 మంది గర్బిణీ మహిళలు ధర్నా చేపట్టారు.

గతంలో కూడా గర్భిణీలకు మరో అవకాశం కల్పించారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక మండలి తాజాగా, వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షలకు హాజరైన తర్వాత వారంతా ఫిజికల్ పరీక్షలకు హాజరుకావొచ్చని వెల్లడించింది. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+