ఎస్ఐ గుండెకు కాల్చుకుని చనిపోయాడు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో, బందోబస్తు కోసం వచ్చిన ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమురం భీమ్ జిల్లా పెంచికల్ పేట్ ఎస్ఐగా ఉన్న శ్రీధర్ మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై... పిల్లర్ నెంబర్ 174 వద్ద పిస్టల్ ను గుండెకు గురిపెట్టుకుని, కాల్చుకుని చనిపోయాడు.
శ్రీధర్ 2012 బ్యాచ్ కు చెందిన అధికారి. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే, పోలీసులు శ్రీధర్ ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ... ఆయన అప్పటికే చనిపోయినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications