జ్యోతీ, నన్ను క్షమించు: ఆత్మహత్య చేసుకున్న ఎస్సై సూసైడ్ నోట్
కరీంనగర్: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పోలీసు క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై జగన్మోహన్ డైరీ, సూసైడ్ నోట్ వివరాలు వెలుగు చూశాయి. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అతను సూసైడ్ నోట్‌లో రాశాడు. డైరీలో తన చివరి కోరికను కూడా వెల్లడించాడు.
జ్యోతీ, నన్ను క్షమించు అంటూ భార్యనుద్దేశించి రాశాడు. తన సోదరుడు కిరణ్ ఎసిబి ట్రాప్‌లో ఇరుక్కున్న విషయాన్ని చెబుతూ ఆ కేసును క్లియర్ చేయాలని ఆయన కోరాడు. తన చివరి కోరిక అంటూ డైరీలో రాశాడు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు అతను డైరీ రాసినట్లు తెలుస్తోంది.

తన అమ్మను మంచిగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను కోరాడు. సుల్తానాబాగ్ సిఐ, ఎస్సై తనకు మంచి మిత్రులు అని రాశాడు. మంచి ఎస్పీ దగ్గర పనిచేసినా తాను మంచి పేరు తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
పెద్దపల్లి ప్రజలు, ఎమ్మెల్యే, ఎస్పీ తనను క్షమించాలని జగన్మోహన్ వేడుకున్నాడు. ఎస్సైలు, ఎస్‌హెచ్ఓలపై పనిభారం అధికంగా ఉంటుందని చెప్పాడు. తన మృతదేహానికి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయవద్దని, ఇంటి వద్దనే చేయాలని ఆయన కోరుకున్నాడు. అలాగే, తన ఫొటోలను గానీ ఫ్లెక్లీలను గానీ పెట్టవద్దని సూచించాడు. ఇంట్లో కూడా తన ఫొటోలు పెట్టవద్దని వేడుకున్నాడు.












Click it and Unblock the Notifications