పెళ్లి రోజే..: మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన కారు, ఎస్ఐ మృతి
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో సోమవారం ఉదయం అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టిప్పుఖాన్ బ్రిడ్జిపై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎస్బీ ఎస్ఐ కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌజ్‌లో సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టిప్పుఖాన్ బ్రిడ్జిపై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాకింగ్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) ఎస్ఐ కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, కారు డ్రైవర్ మాత్రం కారును రివార్సు తీసుకుని ఆపకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఘటనతో లంగర్ హౌజ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, ఈరోజే కిష్టయ్య పెళ్లి రోజు అని ఆయన సన్నిహితులు చెప్పారు.

పెళ్లి రోజునే ఆయన మృతి చెందడంతో కిష్టయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కిష్టయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications