మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేజస్విని ఫిర్యాదుతోనే శిరీష..: శ్రవణ్ ఆలోచనలు రాజీవ్‌కు తెలియదా?

బ్యూటీషియన్ శిరీష, ఎస్సైల ఆత్మహత్యల విషయంలో రోజుకో విషయం వెలుగు చూస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష, ఎస్సైల ఆత్మహత్యల విషయంలో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. రాజీవ్ - శిరీషల మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి తొలుత శిరీష శ్రవణ్‌కు చెప్పలేదని తేజస్విని ఫిర్యాదు తర్వాతే శిరీష ఆయన ముందు బయటపడిందని తెలుస్తోంది.

చదవండి: శిరీష మరణం వెనుక మిస్టరీ..చదవండి: శిరీష మరణం వెనుక మిస్టరీ..

బ్యుటీషియన్‌ శిరీష కేసులో ప్రధాన నిందితుడు శ్రవణ్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చే పంచాయతీల్లో చేయి తిరిగిన బ్రోకర్‌ అని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన శ్రవణ్‌ విద్యార్ధి దశ నుంచే పోలీసులతో స్నేహం పెంచుకున్నాడు. ఎవరి అవసరం ఏమిటి? ఎవరితో ఎలా పని చేయించుకోవాలి? ప్రతిఫలంగా ఏమివ్వాలన్న విషయాలను ఒంట బట్టించుకున్నాడు.

రెండోసారి విచారించినప్పుడు..

రెండోసారి విచారించినప్పుడు..

శిరీష కేసులో శ్రవణ్‌ను రెండోసారి గట్టిగా విచారించినప్పుడు అతనికి, ఎస్సై ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. శిరీష వ్యక్తిత్వం, రాజీవ్‌తో ఉన్న సంబంధాల గురించి వివరాలు వెల్లడయింది. కానీ కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్‌ల మధ్య ఉన్న కీలకమైన లింకు గురించి వెలుగు చూడలేదు.

ఎస్సై, శ్రవణ్‌ల మధ్య..

ఎస్సై, శ్రవణ్‌ల మధ్య..

ఎస్సై, శ్రవణ్‌ల మధ్య ఉన్న నేరపూరిత లింకును బహిరంగంగా కాకుండా.. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎస్సై, శ్రవణ్‌ల మధ్య మంచి స్నేహం ఉందని తెలుస్తోంది.

ఎస్సైని గుప్పిట..

ఎస్సైని గుప్పిట..

ప్రభాకర్ రెడ్డి కానిస్టేబుల్‌గా ఉన్నప్పటి నుంచే శ్రవణ్‌కు పరిచయం ఉందని, అప్పటి నుంచే అతనితో శ్రవణ్‌ పనులు చేయించుకునే వాడని ప్రతిఫలంగా ప్రభాకర్ రెడ్డి కోరుకున్నవి ఏర్పాటు చేసేవాడని తను ఎస్సై అయిన తర్వాత పెద్ద పనులు చేయించుకున్నాడని చెబుతున్నారు. అమ్మాయిలను ఎరవేసి ప్రభాకర్ రెడ్డిని తన గుప్పిట పట్టుకున్నాడని కూడా అంటున్నారు. మూడుసార్లు పంపించినట్లుగా ప్రచారం చెబుతున్నారు.

తేజస్విని ఫిర్యాదుతో..

తేజస్విని ఫిర్యాదుతో..

శ్రవణ్‌కు ఎనిమిది మంది పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలున్నాయని ఎవరి అవసరాన్ని బట్టి వారికి సెటిల్‌ చేసేవాడని రాజీవ్‌, శిరీషల గురించి శ్రవణ్‌కు ముందే తెలుసునని, తేజస్విని ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే శిరీష ఈ విషయమై శ్రవణ్‌ ముందు బయటపడింది. పోలీసు కేసు నమోదైతే తన మర్యాద మంటగలుస్తుందని, అన్యాయంగా తనపై ఫిర్యాదు చేశారని శ్రవణ్‌ వద్ద శిరీష వాపోయిందని తెలుస్తోంది. సాయం కోరింది.

సాయపడితే పనికొస్తుందని..

సాయపడితే పనికొస్తుందని..

అప్పుడు శ్రవణ్‌.. ఎస్సై పేరు చెప్పడం, ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. కానీ శ్రవణ్ మాత్రం మరో ఉద్దేశ్యంతో ఉన్నాడు. శిరీష గురించి ఎస్సైకి ఫోన్ చేసి సమస్యను వివరించాడని ఈ కేసులో సాయపడితే శిరీష పనికొస్తుందని చెప్పాడని తెలుస్తోంది. శిరీషకు బ్యుటీషియన్‌, మేకప్‌ రంగాల్లో తెలిసిన వారు చాలామంది ఉన్నారని ఎస్సైకి చెప్పాడని తెలుస్తోంది. శిరీష ఫోటోలు కూడా పంపించాడు. దీంతో శిరీష, రాజీవ్, శ్రవణ్‌లు ఎస్సై వద్దకు వెళ్లడం, ఆ తర్వాత ఆత్మహత్యలు తెలిసిందే.

శ్రవణ్ కనుసైగ చేశాడని..

శ్రవణ్ కనుసైగ చేశాడని..

శిరీష చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని, పని కొస్తుందని శ్రవణ్‌ చెప్పడంతో ఎస్సై ఎలాంటి జంకు లేకుండా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని వార్తలు వస్తున్నాయి. రాజీవ్‌ను బయటకు తీసుకెళ్తూ శ్రవణ్‌ కనుసైగ చేయడంతోనే ఎస్సై తలుపులు వేసి శిరీషపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని దాంతో ఆమె ప్రతిఘటిస్తూ ఏడుస్తుండటంతో రాజీవ్‌తో పాటు లోనికివచ్చిన శ్రవణ్‌ ఆమెపై దాడి చేశాడని తెలుస్తోంది.

శ్రవణ్ ఆలోచన రాజీవ్‌కు తెలియదా

శ్రవణ్ ఆలోచన రాజీవ్‌కు తెలియదా

రాజీవ్‌ కూడా ఆమె కేకలను కట్టడి చేసేందుకు గట్టిగా కొట్టాడని, ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో తక్షణమే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ ఎస్సై వారిని బయటకు పంపించాడు. ఈ ఉదంతంలో శ్రవణ్‌, ఎస్సైల ఆలోచన గురించి రాజీవ్‌కు తెలియదని అంటున్నారు. శిరీష ఆత్మహత్య అనంతరం కేసును పక్కదారి పట్టించేందుకు, కుకునూరుపల్లి కోణం వెలుగు చూడకుండా శ్రవణ్‌ శతవిధాలా ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది. కాగా ఈ కేసులో శ్రవణ్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, ఫోటోలే కీలక సాక్ష్యాలుగా పోలీసులు కోర్టుకు సమర్పించారు.

English summary
Police Sub-Inspector P. Prabahakar Reddy made sexual advances towards beautician A. Sirisha in his official quarter at Kukunoorpally of Siddipet and shot himself dead a day after her suicide in Hyderabad, apparently worried of his role coming out in the probe, the investigators said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X