త్వరలో సిద్దిపేట నుంచే ఉత్తర భారతానికి రైళ్లు!

సిద్దిపేట ప్రజలకు శుభవార్త. ఇకపై సిద్దిపేట నుంచే ఉత్తర భారతదేశానికి రైళ్లు నడవనున్నాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి హారీష్ రావు వెల్లడించారు. రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు మరో ఏడాదిన్నరలో పూర్తవుతాయని, అప్పటి నుంచి ఉత్తర భారతానికి ప్రత్యక్ష రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.

సిద్దిపేటకు రైలు సౌకర్యం గత ప్రభుత్వ కాలంలోనే సాధ్యమైందని హరీశ్‌రావు గుర్తు చేశారు. రూ.800 కోట్లతో భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించామని, రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు మంజూరు చేశామని ఆయన వివరించారు. ఈ లైన్ పూర్తయి విద్యుదీకరణ అయిన తర్వాత సిద్దిపేట నుంచి నేరుగా ఢిల్లీ, ఇతర ఉత్తరాది నగరాలకు రైళ్లు నడవడం వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలుగుతుందన్నారు.

Siddipet train services North India Siddipet to Get Direct Trains to North India in 1 5 Years to Start Soon

అలాగే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్‌లో వర్తక, వ్యాపార, వాణిజ్య, వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, గత పదేళ్ల పాలనలో రైస్ మిల్లులపై ఎలాంటి దాడులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడం వల్ల సిద్దిపేటకు మరో వందేళ్ల వరకు నీటి కొరత ఉండదని కూడా గుర్తు చేశారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిద్దిపేట ప్రాంతం తెలంగాణకు చాలా ముఖ్యమైనదని అన్నారు, జిల్లాగా ఏర్పడిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని అన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తెలంగాణలో హోటళ్ళు, రెస్టారెంట్ల కిచెన్‌లో సీసీ కెమెరాలు.. కల్తీకి చెక్ పెట్టేలా సూపర్ ప్లాన్!
తెలంగాణలో హోటళ్ళు, రెస్టారెంట్ల కిచెన్‌లో సీసీ కెమెరాలు.. కల్తీకి చెక్ పెట్టేలా సూపర్ ప్లాన్!

సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలతో పాటు ఉత్తర భారతదేశంతో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. జిల్లా ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ విద్యుదీకరణ పనులను వేగవంతం చేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+