TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ విషయం శంకర్ లక్ష్మికి ముందే తెలుసా..!
తెలంగాణలో సంచలనం టీఎస్పీఎస్సీ పేపర్ల లీకు కేసులో సిట్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది విచారించిన సిట్.. డీఏవో పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన రాహుల్, శాంతి, సుచరితలను సిట్ ప్రశ్నిస్తోంది. వీరిని విచారించేందుకు 3 రోజులు కస్టడీలోకి ఇవ్వాలన్న సిట్ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. చంచల్ గూడ జైలు నుంచి నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులకు బెయిల్ వచ్చింది.
అయితే యుజర్ ఐడి, పాస్ వర్డ్ ఎలా బయటకు వచ్చిందో.. ఇంకా తెలియలేదు. ఇందుకు సంబంధించి ఇన్ ఛార్జ్ శంకర్ లక్ష్మిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో శంకర్ లక్ష్మి ఇప్పటి వరకు సాక్షిగా మాత్రమే ఉండేవారు. అయితే శంకర్ లక్ష్మికి సంబంధించి సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించారించి పరిశీలించగా.. లీకేజీ అంశంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు 37 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో కొంత మందికి బెయిల్ కూడా వచ్చింది.

శంకర్ లక్ష్మి 2017 నుంచి టీఎస్‌పీఎస్‌సీలో విధులు నిర్వర్తిస్తోన్నారు. DAO, AEE, AE పేపర్ల అంశంలో టీఎస్‌పీఎస్‌సీ వివరాలు దాచిపెట్టినట్లు సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సహకరించుకుంటేతీవ్ర పరిణామాలు తప్పవని సిట్ టీఎస్పీఎస్సీకి హెచ్చరించింది. ఈ కేసులో కీలక నిందితురాలి ఉన్న రేణుకు సిట్ మరోసారి విచారించనుంది.
రేణుకకు సంబంధించి సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. రేణుక నుంచి గంబీరాం రాహుల్‌కు గ్రూప్ పేపర్ లీకైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. గంబీరాం రాహుల్‌ను రేణుక తన సొంత వాహనంలోనే హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తి అవుతుందో ఇంకా ఎలాంటి స్పష్టం రావడం లేదు.












Click it and Unblock the Notifications