జాతీయస్థాయిలో చరిత్ర సృష్టించాం: కెసిఆర్, ఏకగ్రీవ ఎమ్మెల్సీలు భేటీ
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగం స్థానాలను ఏకగ్రీవంగా గెలిచి జాతీయస్థాయిలోనే ఓ చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు అన్నారు. టిఆర్ఎస్ నుంచి కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. వరంగల్ ఎన్నికల ఘన విజయం తర్వాత మళ్లీ ఇదొక అద్భుత విజయమని అభివర్ణించారు. ఈ విజయంతో ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.

ఎన్నికల తర్వాత మళ్లీ ఒకసారి అందరితో సమావేశమవుతానని సిఎం కెసిఆర్ తెలిపారు. త్వరలో తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. వరంగల్ ఉప ఎన్నికలో గెలుపు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

గెలుపు నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోవాలని కొత్త ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్సీలను కోరారు.

దేవాలయాల అర్చక, ఉద్యోగులకు వేతన విధానం
దేవాదాయశాఖలోని అర్చకులకు, ఉద్యోగులకు నిర్దిష్ట వేతన విధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేవాదాయశాఖలో వివిధ దేవాలయాలద్వారా లభిస్తున్న ఆదాయవనరులతో కలిపి రూ.100కోట్లతో కార్పస్‌ఫండ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఫండ్‌ద్వారా ఆలయాల్లోని అర్చకులు, ఉద్యోగులు కలిపి 6,400 మందికి వేతనాలు ఇచ్చేందుకు వీలుకలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications