స్మితా సబర్వాల్ రాజీనామా?
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల పైన పెట్టిన పోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. స్మిత సబర్వాల్ పెట్టిన పోస్ట్ దివ్యాంగులను ఆందోళనకు గురిచేస్తుందని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత వ్యాఖ్యానించారు. ఐఏఎస్ కావాలంటే అందగత్తెలే ఐఏఎస్ కావలసిన అవసరం లేదని బాలలత వ్యాఖ్యానించారు. స్మిత సబర్వాల్ పెట్టిన పోస్ట్ ప్రభుత్వ ఆలోచననా లేదా ఆమె సొంత ఆలోచనా.. చెప్పాలని ప్రశ్నించారు.
బాల లత వ్యాఖ్యల పోస్ట్
ఇదే సమయంలో స్మిత సబర్వాల్ రాజీనామా చేసి రావాలని, తనతో కలిసి మళ్ళీ పరీక్ష రాసి పోటీ పడాలని సవాల్ విసిరారు. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం అని పేర్కొన్న బాల లత మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం అంటూ స్మిత సబర్వాల్ కు సవాల్ చేశారు. అయితే బాల లత చేసిన వ్యాఖ్యలను ఎక్స్ ఖాతాలో పంచుకున్న సీనియర్ జర్నలిస్టు సుధాకర్ ఉడుముల పోస్టు చేశారు.

బాల లత సవాల్ ను స్వీకరించిన స్మితా సబర్వాల్
ఈ పోస్టును ట్యాగ్ చేసిన స్మిత సబర్వాల్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. బాల లత చేసిన విచిత్రమైన సవాల్ ను తాను స్వీకరిస్తానని కానీ తన వయసు పెరిగిన కారణంగా యుపిఎస్సి తనను పరీక్ష రాయటానికి అనుమతిస్తుందో లేదో అన్న సందేహం ఉందంటూ స్మిత సబర్వాల్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన పరీక్షలు రాసేందుకు సిద్ధం అన్నారు స్మితా సబర్వాల్.
బాల లతకు స్మితా సబర్వాల్ ప్రశ్న
సుధాకర్ ఉడుముల మీరు ఆమె ప్రతినిధిగా దయచేసి ఆమెను ఒక ప్రశ్న అడగాలని సూచించారు. వికలాంగుల కోటాలో బాల లత తనకు ఇచ్చిన ప్రత్యేక హక్కును దేనికోసం ఉపయోగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఆమె కోచింగ్ ఇన్స్టిట్యూట్ లను నడపడానికి ఉపయోగించారా ? లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించారా? చెప్పాలని స్మిత సబర్వాల్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
వెనక్కు తగ్గని స్మితా సబర్వాల్
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల నుంచి స్మితా సబర్వాల్ ట్వీట్ పైన నిరసనలు వ్యక్తం అవుతున్నా, ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం తాను పెట్టిన ట్వీట్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన కామెంట్స్ కు స్టిక్ అయి స్మిత సబర్వాల్ తన వాదన కొనసాగిస్తున్నారు అన్నది తాజాగా ఆమె పెట్టిన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది.
ఆ రంగాల్లో దివ్యాంగుల కోటా ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలి
ఇక దీనిపై నిన్న కూడా స్పందించిన స్మిత సబర్వాల్ తన టైం లైన్ మీద చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని కానీ ఐపీఎస్, ఐఎఫ్ఓ, రక్షణ వంటి కొన్ని రంగాలలో ఈ కోట ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించాల్సిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నాను అన్నారు.
వ్యతిరేఖత వచ్చినా సరే .. తన వ్యాఖ్యలకే కట్టుబడిన స్మితా సబర్వాల్
తాను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఐఏఎస్ లు కూడా అంతేనని స్మితా సబర్వాల్ అన్నారు. తాను ఉన్న వాస్తవాన్ని చెప్పానని స్మిత సబర్వాల్ పేర్కొన్నారు. ఏది ఏమైనా స్మిత సబర్వాల్ తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోదు ఈ విషయంలో వెనక్కు తగ్గదు అనేది తాజాగా ఆమె చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications