టెక్కీ అదృశ్యం: ఫోన్ స్విచ్చాఫ్, చివరి ఫోన్ ఎవరికి.. పోలీసుల ఆరా
హైదరాబాద్: టిసిఎస్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న కర్నాటకకు చెందిన అనుశ్రీ అదృశ్యానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె ఉంటున్న హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీలో అనుశ్రీకి సంబంధించిన దృశ్యాలను సేకరించారు. ఆమె వెళ్లిన మార్గంలోనే మిగతా కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కర్నాటకకు చెందిన అనుశ్రీ సోమవారం నాడు కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె కర్నాటకకు చెందిన యువతి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సోమవారం అనుశ్రీ అందరితోపాటు కార్యాలయానికి వెళ్లారని, ఎప్పుడు ఆమె డల్‌గా కనిపించేది కాదని, బాగా మాట్లాడుతుందని, అయితే శుక్రవారం నాడు ఊరి నుంచి వచ్చాక కొంత డల్‌గా ఉన్నారని, ఎందుకని అడిగితే ఏం లేదని చెప్పారని హాస్టల్లో ఉంటున్న వారు చెబుతున్నారు.
పోలీసులు హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. ఆమె వెళ్లిన వైపున ఉన్న మిగతా సీసీ కెమెరాలు పరిశీలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మొబైల్ డాటాను తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మొబైల్ ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంది. ఆమె ఫోన్ ఎక్కడ స్విచ్చాఫ్ అయింది, ఆదివారం రాత్రి నుంచి ఆమెకు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి, ఎవరికి ఫోన్లు చేశారో పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications