రైల్వే ప్రయాణికులకు అలర్ట్: ఆ రైళ్లు రద్దు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. రైలు ప్రయాణం ఎక్కువగా చేసే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ప్రయాణం చేయాలని భావిస్తే ఏయే రైళ్లు ఎప్పుడెప్పుడు రద్దయ్యాయో తెలుసుకోవడం మంచిది. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
హసన్ పర్తి- ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య పనులు జరుగుతుండటంతో 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాజీపేట- హసన్ పర్తి, బళ్లార్ష-కాజీపేట, కరీంనగర్-సిర్పూర్ మధ్య రైళ్లు రద్దయ్యాయి. సిర్పూర్-కరీంనగర్ రైళ్లు కూడా రద్దయ్యాయి. ఈనెల 19 నుంచి జనవరి 13 వరకు వీటిని రద్దుచేశారు.

బోధన్- కరీంనగర్ రైలు 20 నుంచి జనవరి 14 వరకు, కరీంనగర్- బోధన్ రైలు 19 నుంచి జనవరి 13 వరకు, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ రైళ్లు కూడా రద్దయ్యాయి. వీటిని జనవరి 2 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. రైలు ప్రయాణం చేయాలనే ఆలోచనలో ఉంటే వీటి వివరాలు తెలుసుకొని ప్రయాణించడం ఉత్తమం.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు రైల్వే నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సింగిల్ ట్రాక్ ఉన్న మార్గాల్లో డబుల్ ట్రాక్, డబుల్ ట్రాక్ ఉండి రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో మూడోలైను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. ఒడిసాలోని బాలాసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే సరిచేస్తోంది.












Click it and Unblock the Notifications