విచిత్రం: ముసుగు ధరించి కళ్లలో కారం కొట్టి దోచిందిఅల్లుడే
హైదరాబాద్: గత నెల 31వ తేదీన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పరిధిలో గల తులసీనగర్‌లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఇంట్లో ఒంటరిగా ఉన్న అంటోనమ్మ అనే వృద్దురాలి కళ్లలో కారం కొట్టి, ఆమెను చితకబాది నగలు, నగదు దొంగలించాు.
ఆ కేసును పోలీసులు ఛేదించారు. అంటోనమ్మ అల్లుడు హ్యారీయే ఆ దొంంగతనానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది.ఇంట్లో నగలు, నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన హ్యారీ ముసుగు ధరించి ఇంట్లోకి చొరబడి అంటోనమ్మను గాయపరిచాడు.

ఆమె ప్రతిఘటించడంతో కళ్లలో కారం కొట్టాడు. దాంతో ఆంటోనమ్మ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే బీరువాలోని 12 తులాల బంగారు నగలను, రూ1.15లక్షల నగదు తీసుకుని పారిపోయాడు.
ఆంటోనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిసిటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా హ్యారీనే చోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications