తండ్రిని పంచుకున్న కొడుకులు.. చితి పేర్చుకుని, నిప్పంటించుకుని తండ్రి ఆత్మహత్య!!

కడుపున పుట్టిన కొడుకులు తండ్రిని వంతులవారీగా పంచుకుంటే ఆ వృద్ధుడైన తండ్రి తట్టుకోలేకపోయాడు. 90 ఏళ్ల వయసులో తనను చూడటం కోసం కొడుకులు వేసుకుంటున్న వంతులు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తన చితిని తానే పేర్చుకుని, నిప్పంటించుకుని అందులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఇంతకీ ఆ తండ్రి ఎవరు? ఆ కొడుకులు చేసిన పని ఏమిటి?

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య కొంతకాలం క్రితం చనిపోవడంతో ఆయన తనకున్న పొలాన్ని తన నలుగురు కుమారుల పేరుతో రాసిచ్చాడు. కొంతకాలంగా స్వగ్రామంలో ఉంటున్న పెద్దకొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నలుగురు కొడుకులు ఉన్నప్పుడు మేము ఎందుకు చూడాలి అని వంతు వచ్చిన క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి నలుగురు కొడుకులు తమ తండ్రిని నెలకు ఒక్కరు వంతు చొప్పున చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 funeralpyed

ఇద్దరు కుమారులు సొంత గ్రామంలో ఉంటే మరొకరు హుస్నాబాద్ లో, ఇంకొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట లో నివసిస్తున్నారు. దీంతో వెంకటయ్య కు తాను బతికిన గ్రామాన్ని వదిలి పెట్టి వెళ్లడం ఇష్టం లేదు. అంతేకాకుండా కుమారులు నలుగురు తనను వంతులవారీగా పంచుకోవడం, వంతుల ప్రకారం వాళ్ల ఇళ్లకు వెళ్లి ఉండటం వెంకటయ్య కు అస్సలు ఇష్టం లేదు.

దీంతో తీవ్ర ఆవేదన చెందిన వెంకటయ్య కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం గ్రామ శివారులోని ఎల్లమ్మ గుట్ట వద్ద పీరు వేసి, అనంతరం తన చితిని తానే పేర్చుకుని నిప్పంటించుకుని అందులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

చితికి నిప్పంటించుకుని అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి వెంకటయ్య ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హృదయ విదారక ఘటనగా వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+