కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందేభారత్ పై కీలక నిర్ణయం - ఇక నుంచి..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వందేభారత్ తో పాటుగా వందే భారత్ స్లీపర్ కోసం ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగా రెండు వందేభారత్ రైళ్ల కోసం రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన రెగ్యులర్ రైళ్లల్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా కొత్తగా వందేభారత్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ ఆక్యెపెన్సీ పెరుగుతోంది. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీ నుంచి కొత్త నిర్ణయం అమలు కానుంది.
కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంద శాతం ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తోంది. నిత్యం ఈ రైలు కోసం వెయిటింగ్ లిస్టు ఉంటోంది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు రైల్వే అధికా రులు ఈ రైలు కు కొత్తగా కోచ్ ల సంఖ్య ను 16 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ కు ఇదే విధంగా కోచ్ ల సంఖ్య పెంచారు. ఇక, ఇప్పుడు కాచిగూడ - యశ్వంత్ పూర్ రైలులో నూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఈ రైలు లో ప్రస్తుతం ఉన్న సీటింగ్ సామర్ద్యం530 నుంచి 1,128 కి పెరగనుంది.

20703/20704 కాచిగూడ - యశ్వంత్‌పూర్ - కాచిగూడ మధ్య నడిడే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను మొదట 08 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టారు.. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. సాధారణ సర్వీసులు ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు 100శాతం ఆక్యెపెన్సీ రేషియోతో నడుస్తోంది. దీంతో.. ఇప్పటికే ఉన్న ఎనిమిది బోగిలకి అదనపు కోచ్‌లను జత చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. కొత్త కోచ్‌ల ఏర్పాటుతో 1024 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 14 చైర్ కార్లు, 104 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగిలు అందుబాటులోకి రానున్నాయి. 2023 సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం అయింది. కోచ్‌ల రెట్టింపుతో, ఐటీ నగరాలైన హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications