Railway news: హైదరాబాద్ వాసుల ఇళ్లకే వచ్చి.. శుభవార్త చెప్పిన రైల్వే!

ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఒకపక్క భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వేళ, దక్షిణ మధ్య రైల్వే కూడా తన పరిధిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రైలు ద్వారా పార్సిల్స్ పంపించాలని భావించేవారు రైల్వే స్టేషన్ కి వెళ్లి బుక్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

ఇంటి వద్దకే పార్సిల్స్ పికప్, డెలివరీ
వినియోగదారుల సౌకర్యం కోసం ఇంటి వద్దకే వెళ్లి పార్సిల్స్ ను పికప్ చేసుకుని, గమ్యస్థానానికి డెలివరీ చేసే అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నూతన విధానంలో రైలు ద్వారా పార్సిల్స్ పంపించాలి అనుకునేవారు ఇంటి నుండే పార్సిల్ ని బుక్ చేసే అవకాశం అందించింది.

South Central Railway has some great news for the people of Hyderabad about railway parcel service

డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా పార్సిల్ వ్యవస్థ
డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా రైల్వే రవాణాలోని మూడు కీలక దశలను ఏకతాటిపైకి తీసుకువస్తోంది. వినియోగదారుల పార్సిల్స్ ను ఇంటి వద్దకు వెళ్లి నేరుగా పికప్ చేసుకునే ఫస్ట్ మెయిల్, రవాణా చేసే మిడ్ మెయిల్, ఆ తర్వాత గమ్యస్థానం లో మళ్ళీ నేరుగా ఇంటికే డెలివరీ చేసే లాస్ట్ మెయిల్, ఈ మూడు దశల ద్వారా పార్సల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తోంది.

వినియోగదారులకు అప్లికేషన్ ఆధారిత పార్సిల్ సర్వీస్
దీనికోసం ఒక అప్లికేషన్ ఆధారిత పార్సిల్ లాజిస్టిక్ సిస్టంను రూపొందించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఏకీకృత వ్యవస్థ రవాణా ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తుందని, వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్
తొలి దశలో హైదరాబాద్ డివిజన్లో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇతర డివిజన్లకు కూడా ఈ సేవలు విస్తరించబడతాయి. ఈ డిజిటల్ సేవలకు నెక్స్ట్ జెన్ రైలు పార్సిల్ యాప్ కీలక సాధనంగా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు పార్సిల్స్ ను బుక్ చేసుకోవచ్చు. రియల్ టైంలో తమ పార్సెల్ ఎక్కడ ఉంది అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు.

రైల్వేకు అదనపు ఆదాయం సమకూరేలా ప్లాన్
ఈ సేవల కోసం దక్షిణ మధ్య రైల్వే సమర్థవంతమైన లాజిస్టిక్స్, ఫ్లీట్ సర్వీస్ ప్రొవైడర్ లను భాగస్వాములుగా ఆహ్వానించింది. ఈ భాగస్వామ్యాల కారణంగా రైల్వేకు అదనపు ఆదాయం సమకూరుతుందని, ఇదే సమయంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు తక్కువ ఖర్చుతో వేగంగా సురక్షితంగా మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా రవాణా చేసుకునే అవకాశం కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు . దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటున్న ఈ చొరవ భారతీయ రైల్వేలను ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగంలో మరింత బలోపేతం చేస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+