ఎట్టకేలకు తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు: 3 రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు ఈ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం కాస్త చల్లబడింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం
వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అంతేగాక, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం రాస్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మంగళ, బుధవారాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Southwest monsoon enters in Telangana state: next three days rain in districts

రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుసతాయని వాతావవరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+