వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అమ్రపాలి'ని దేవతను చేశారు: కలెక్టర్ క్రేజ్ పీక్స్, ఒడిలో గణేశుడి విగ్రహం..

వరంగల్ జిల్లా కాజీపేట ప్రజలు మాత్రం పార్వతి దేవీ స్థానంలో అమ్రపాలిని చేర్చారు. అమ్రపాలి విగ్రహాన్ని రూపొందించి ఆమె ఒడిలో బాల గణేశుడిని పెట్టారు. ఇది అమ్రపాలి విగ్రహమే అని పోల్చుకునేలా.. వెనకాలే ఆమె

|
Google Oneindia TeluguNews

వరంగల్: అభిమానం ఆరాధన స్థాయికి చేరుకుంటే నేతలే దైవాలై కొలువుదీరుతారు. రాజకీయ నాయకులు,సినీ హీరోల కటౌట్స్.. రాముడు లేదా మరో దేవుని రూపంలో దర్శనమివ్వడానికి ఇదే కారణం. అయితే ఇది కేవలం వారికే పరిమితం కాలేదు.. ఎవరి మీద అభిమానం పీక్స్‌కు వెళ్లినా చాలు.. వారిని దైవానికి ప్రతీకలుగా మార్చేస్తున్నారు.

ట్రెండ్‌కు తగ్గట్లుగా వినాయకులను తయారుచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. తమ అభిమాన వ్యక్తుల మీద ఆరాధనతో కొంతమంది ప్రత్యేక విగ్రహాలు తయారుచేయిస్తున్నారు. అలా తయారైందే ఈ ఫోటోలోని విగ్రహం కూడా. సాధారణంగా అయితే బాల గణేశుడు తల్లి పార్వతి దేవి ఒడిలో ఉంటాడు.

special ganesh idol: collector amrapali craze in kazipet

కానీ వరంగల్ జిల్లా కాజీపేట ప్రజలు మాత్రం పార్వతి దేవీ స్థానంలో అమ్రపాలిని చేర్చారు. అమ్రపాలి విగ్రహాన్ని రూపొందించి ఆమె ఒడిలో బాల గణేశుడిని పెట్టారు. ఇది అమ్రపాలి విగ్రహమే అని పోల్చుకునేలా.. వెనకాలే ఆమె ఒరిజినల్ ఫోటోను కూడా తగిలించారు.

నిజాయితీ, నిబద్దత గల అధికారిగా పేరు తెచ్చుకున్న అమ్రపాలి పట్ల జనంలో ఒకింత క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. కానీ ఇలా ఆరాధన స్థాయికి ఆ అభిమానం చేరుకోవడం కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తోంది. ఏదేమైనా కాజీపేట వాసులు ప్రతిష్టించిన ఈ విగ్రహం ఇప్పుడక్కడ చాలామందిని ఆకట్టుకుంటోంది.

English summary
Warangal Collector Amrapali craze stunning everyone in Kazipet. Local people made a statue of Amrapali holds bala ganesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X