హాజీపూర్ ఘటన మరువకముందే .... వలిగొండలో ఓ కామాంధుడి ఘాతుకం

హజీపూర్‌ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాంగురాలన్న జాలి కూడా లేకుండా అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు . నిందితుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

వలిగొండలో మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి

వలిగొండలో మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి

ఓ మానసిక వికలురాలైన బాలిక ఇంటి ఆవరణలో నిద్రిస్తోంది. తల్లిదండ్రులు ఎండాకాలం కావటంతో డాబాపైన నిద్రిస్తున్నారు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన బూరుగు మహేందర్‌ అలియాస్‌ మహేష్‌ అనే కామాంధుడు ఇంటి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశింఛి నిద్రిస్తోన్న బాలికపై లైంగిక దాడికి దిగాడు. మాటలు రాని యువతి అరవలేకపోవడంతో మూలుగుతున్న శబ్దాన్ని మేడపై నిద్రిస్తున్న బాలిక తల్లి విని కిందకుదిగి వచ్చి చూడగా మహేందర్‌ లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడనుంచి తప్పించుకున్నాడు.

నిందితుడికి దేహ శుద్ధి .. రాస్తారోకో ... ఉరి తీయాలని డిమాండ్

నిందితుడికి దేహ శుద్ధి .. రాస్తారోకో ... ఉరి తీయాలని డిమాండ్

బాలిక తల్లి, తన సోదరుడితో కలిసి అదేరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతే కాదు అనంతరం నిందితుడిని పట్టుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధిచేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం రామన్నపేట ప్రభుత్వా సుపత్రికి తరలించారు.ఇక మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడిచేసిన నిందితుడు మహేందర్ ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులుగ్రామస్థులు భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేశారు. సుమారుగా 40నిమిషాలపాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.

కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్న పోలీసులు

కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్న పోలీసులు

బాధితురాలికి న్యాయం జరిగే వరకు రా స్తారోకో విరమించేది లేదని చెప్పిన గ్రామస్తులు, పోలీసులు నిందితున్ని శిక్షిస్తామని హామీఇవ్వడంతో, రాస్తారోకో విరమించారు.లైంగికదాడి చేసిన నిందితుడు మహేందర్‌ను కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ,నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. నిందితుడు ఉంటున్న ఇంటిని తనిఖీ చేసి, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినట్లు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే బాదితురాలి బంధువులు, గ్రామస్తులు మాత్రం ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ఘాతుకాలు తగ్గుతాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+