ట్విస్ట్: బ్యూటీషీయన్ శిరీష కేసులో శ్రవణ్ డబుల్ గేమ్, వదిలించుకొనేందుకు రాజీవ్ సై?

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఆమె మరణించి 8 రోజులు దాటినా ఇంకా కూడ ఆమె మృతిపై రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఆమె మరణించి 8 రోజులు దాటినా ఇంకా కూడ ఆమె మృతిపై రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శిరీష ఆత్మహత్య చేసుకోలేదని ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా కొన్ని విషయాల్లో మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయని కుటుంబసభ్యులు అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు ఆమె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని వారు అభిప్రాయంతో ఉన్నారు.శిరీషను హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ కేసులో ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రిమాండ్ లో ఉన్న నిందితులు రాజీవ్,శ్రవణ్ లను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో కూడ కుటుంబసభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రైటర్ శ్రీనివాస్ రెడ్డి నోరు తెరిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని వారు అంటున్నారు.

అనేక అనుమానాలు

అనేక అనుమానాలు

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బ్యూటీషీయన్ శిరీషపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని పోలీసులు ప్రకటించారు.అయితే ఆమె లో దస్తులపై ఉన్న రక్తం మరకలు ఉన్నట్టుగా గుర్తించారు.అంతేకాదు వీటిని పోరెన్సిక్ నివేదిక కోసం పంపారు. ఆమెపై లైంగికదాడి జరిగిందా, లేదా అనే విషయాన్ని శాస్త్రీయంగా తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఎస్ఐ క్వార్టర్ లో ఏం జరిగింది?

ఎస్ఐ క్వార్టర్ లో ఏం జరిగింది?

ఈ నెల 12వ, తేది రాత్రి కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందనే అనుమానాలను పోలీసులు కూడ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాలు బయటపడాలంటే రాజీవ్, శ్రవణ్ లు నోరువిప్పాల్సిందేననే అభిప్రాయంతో ఉన్నారు పోలీసులు. అందుకే వారిని ఐదురోజుల కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శిరీష, తేజస్విని మద్య చోటుచేసుకొన్న వివాదాలతో పాటు మద్యం మత్తులో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు వారిద్దరిని విచారించే అవకాశం లేకపోలేదు.

శ్రవణ్ డబుల్ గేమ్

శ్రవణ్ డబుల్ గేమ్

శిరీషకు స్నేహితుడైన శ్రవణ్ .....తేజస్విని, శిరీషకు మద్య చోటుచేసుకొన్న విబేధాల విషయంలో డబుల్ గేమ్ తో వ్యవహరించారనే పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రవణ్ మాట్లాడిన కాల్స్ సంఖ్యను గుర్తించారు. అన్నా..శిరీష లీడింగ్ బ్యూటీషీయన్...ఆమెకు ఫేవర్ చేస్తే మనకు భవిష్యత్తులో బాగా పనికొస్తోంది. శిరీషను తీసుకొస్తా...మీరు చూసి డిసైడ్ చేయండంటూ ఎస్ఐతో చెప్పినట్టు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

శిరీషను వదిలించుకొనేందుకు శ్రవణ్ కు రాజీవ్ ఒకే

శిరీషను వదిలించుకొనేందుకు శ్రవణ్ కు రాజీవ్ ఒకే

బ్యూటీషీయన్ శిరీషను వదిలించుకోవాలని రాజీవ్ భావించాడు. ఐటి కంపెనీలో హెచ్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న తేజస్వినిని రాజీవ్ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడు. అయితే ఈ విషయమై శిరీష రాజీవ్ ను నిలదీసిందని పోలీసులు ప్రకటించారు. తేజస్విని, శిరీషల మధ్య రాజీవ్ విషయమై గొడవ జరిగింది. అంతేకాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకొనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే శిరీషను వదిలించుకొంటేనే తేజస్విని వివాహం చేసుకోవచ్చనే అభిప్రాయానికి రాజీవ్ వచ్చాడని తమ విచారణలో తేలిందని హైద్రాబాద్ సిపి మహేందర్ రెడ్డి చెప్పారు. శిరీషను వదిలించుకొందాం ...నీకు ఇష్టమేనా? అంటూ రాజీవ్ తో శ్రవణ్ అన్నట్టు సమాచారం. శ్రవణ్ ఆడిన డబుల్ గేమ్ విషయం తెలియని రాజీవ్ ఒకే చెప్పడంతో రాత్రివేళ హడావుడిగా కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. దీని ఆధారాంగానే పోలీసులు శ్రవణ్ పై ప్రధాన నిందితుడిగా అభియోగాలు మోపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+